సాక్షి, విజయవాడ: విజయవాడ నగరంలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అల్లుడు తన అత్తను కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ సమస్యల కారణంగా అల్లుడు నాగ సాయి అత్త కోలా దుర్గపై దాడి చేసి కత్తితో పొడిచి చంపినట్లు సమాచారం. సంఘటన తర్వాత నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని విచారిస్తున్న పోలీసులు, హత్యకు దారితీసిన కారణాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ కలహాలు ఇంతటి దారుణానికి దారితీసినందుకు ప్రజలు షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలో మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.


