తాడేపల్లి: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. మూర్తి చెప్పినట్లే బీఆర్ నాయుడు చాలాకాలం యాది ఉంటారంటూ పేర్ని నాని చమత్కరించారు.
అవి ఫేక్ వీడియోలని, తమద 30 ఏళ్ల బంధమని బీఆర్ నాయుడి చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు పేర్ని నాని స్పందిస్తూ .. ‘ఒకవైపు ఫేక్ వీడియోలు అంటారు.. మరొకవైపు వారిది 30 ఏళ్ల బంధమని బీఆర్ నాయుడే చెప్పినట్లే మీరు అంటున్నారు. సాధారణంగా ఏడేళ్ల బంధమే బలమైనది అనేది లోకరీతిన అంటుంటాం. మరి వారిది 30 ఏళ్ల బంధమైతే అది చాలా బలమైనదే’ అంటూ సెటైర్లు వేశారు.
‘సోషల్ మీడియాలో తిరిగేవి ఫేక్ వీడియోలు అయితే.. ఒరిజినల్ వీడియోలను బీఆర్ నాయుడు విడుదల చేయాలి. ఆ ఒరిజినల్ వీడియోలతో సమాజం నోరు మూయించండి. ఆ దేవ దేవుడు కాళ్ల దగ్గర కూర్చున్పప్పుడు ఈ బంధాలు, రాగ ద్వేషాలకు అతీతంగా ఉండాలని సమాజం చెబుతుంది. బీఆర్ నాయుడు కొండ దిగే టైమ్ దగ్గర్లనే ఉన్నట్లు ఉంది’’ అంటూ పేర్ని నాని మరో సెటైర్ వేశారు.
ఇదీ చదవండి:
వాత్సాయనుడికి వారసుడు బీఆర్ నాయుడు: భూమన


