అంగన్వాడీల పై చంద్రబాబు ప్రభుత్వం నిర్భదం | Chandrababu Govt pressure on Anganwadis | Sakshi
Sakshi News home page

అంగన్వాడీల పై చంద్రబాబు ప్రభుత్వం నిర్భదం

Mar 1 2026 11:14 PM | Updated on Mar 1 2026 11:14 PM

Chandrababu Govt pressure on Anganwadis

సాక్షి,విజయవాడ: అంగన్వాడీ ఉద్యోగుల "చలో విజయవాడ" కార్యక్రమంపై చంద్రబాబు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు విజయవాడకు తరలివస్తుండగా, పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు.  

నంద్యాల రైల్వే స్టేషన్‌లో అంగన్వాడీ ఉద్యోగులను పోలీసులు నిర్భంధించారు. అంగన్వాడీ లీడర్స్‌కి సిడిపివోలు ఫోన్ కాల్స్ చేస్తూ ఒత్తిడి తెస్తున్నారని యూనియన్ నాయకులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేలు బెదిరింపులు చేస్తున్నారని యూనియన్ నేతలు వెల్లడించారు.  ప్రభుత్వ నిర్భంధంపై సీఐటీయూ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.  

అంగన్వాడీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడకు భారీగా తరలి వస్తున్నారు. చలో విజయవాడ కి వెళ్ళొదంటూ స్థానిక ఎమ్మెల్యేలు బెదిరింపులు.

Advertisement
 
Advertisement
Advertisement