సాక్షి, విజయవాడ: భవానిపురం బొబ్బూరి గ్రౌండ్స్ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో కారు బీభత్సం సృష్టించింది. పాదచారులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో సాక్షి టీవి ప్రతినిధి నాగేంద్ర చేతికి తీవ్ర గాయమైంది. రాజరాజేశ్వరి పేటకు చెందిన యూట్యూబర్‌కి చెందిన కారుగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మద్యం సేవించి కారు డ్రైవ్ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఎలక్ట్రికల్ కారులో మంటలు..
మరో ఘటనలో బెంజ్ సర్కిల్ వద్ద ఎలక్ట్రికల్ కారులో మంటలు చెలరేగాయి. కారు యాజమాని అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. కారు కానూరుకు చెందిన పీఆర్ హాస్పిటల్ డాక్టర్ చెందినదిగా గుర్తించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.


