సొంతూరికి సంక్రాంతి రద్దీ నాలుగైదు రోజుల ముందే మొదలైంది.
శనివారం బస్సులు, రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
స్వగ్రామంలో పండగ చేసుకునేందుకు నగర వాసులు బయలుదేరారు.
ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్‌బీ నగర్ తదితర బస్టాండ్లకు ప్రయాణికులు పోటెత్తారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జనంతో కిటకిలాడింది.
రోజంతా నగరంలోని ప్రధాన కూడళ్లు ట్రాఫిక్‌జాంలతో కనిపించాయి.


