కోనసీమ బ్లో అవుట్‌తో స్థానికంగా భీతావాహ వాతావరణం నెలకొంది. నిన్న(సోమవారం, జనవరి 5వ తేదీ) మధ్యాహ్నం నుంచి ఆ బ్లో అవుట్ ఏకథాటిగా కొనసాగుతూనే ఉంది. ఎగిసిపడుతున్న మంటలతో చుట్టుపక్కల ఊళ్లల్లో భయానక వాతావారణ కనిపిస్తోంది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్‌జీసీకి చెందిన మోరి–5వ నెంబరు బావి వద్ద ఒక్కసారిగా బ్లోఅవుట్ సంభవించింది.


