సాక్షి, గుంటూరు: ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు.. మూడేళ్లలో తమ ప్రభుత్వం వస్తుందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మాజీ మంత్రి అంబటి కాపు కులానికి టైగర్.. అలాంటి వ్యక్తిని స్టేషన్‌లో నల్లపాడు, పట్టాభిపురం సీఐలు దారుణంగా కొట్టారన్న వైఎస్ జగన్.. వచ్చేది తమ ప్రభుత్వమేనని.. అన్నింటిపై ఎంక్వైరీలు వేస్తాం.. వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు.
‘‘మా ప్రభుత్వం వచ్చాక అన్ని లెక్కలు తేలుస్తాం. విషపూరిత విత్తనాలు నాటడం ఆపండి. రేపు మా కార్యకర్తలు స్పందిస్తే ఏమవుతుందో ఆలోచించండి. చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చండి. దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం. రాష్ట్రవాప్తంగా బంద్‌కు కూడా పిలుపునిస్తాం. మేం భయపడతామనుకుంటే చంద్రబాబు ముర్ఖుడే. వైఎస్సార్‌సీపీ శ్రేణులు నాలుగింతలు రెచ్చిపోయి కూటమి ప్రభుత్వాన్ని పెకిలిస్తారు’’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు.
‘‘200మంది సీఐ, ఎస్సైలు వీఆర్‌లో ఉన్నారు. మీకు కావాల్సిన వారినే పోలీసులు నియమించుకున్నారు. బిహార్ సంగతేమో కానీ.. ఏపీలో మాత్రం జంగల్ రాజ్ నడుస్తోంది. తప్పు చేసిన అధికారుల్ని ఆధారాలతో సహా కోర్టులో నిలబెడతాం’’ అని వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చారు.



