సాక్షి,అమరావతి: జనసేన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆగడాల గురించి సీఎం చంద్రబాబుకు ముందే తెలుసని బాధితురాలు మీడియాతో ఎదుట బాంబు పేల్చారు.
ఎమ్మెల్యే శ్రీధర్‌పై చంద్రబాబుకు ఫిర్యాదు చేశా. నారావారిపల్లెలో 10రోజల క్రితమే చంద్రబాబుకు ఫిర్యాదు చేశా. ఎమ్మెల్యేను పిలిచి మాట్లాడతారునుకున్నా. బాబు మాత్రం సాధారణ అర్జీదారునిగానే ఫిర్యాదును తీసుకున్నారు. నాకు జరిగిన అన్యాయంపై న్యాయపోరాట చేస్తా. ఎమ్మెల్యే నుంచి నాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు’అని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు టెలిగ్రామ్‌లో మెస్సేజ్ చేశాను.రెండురోజులు బాగానే మాట్లాడారు. ఆ తర్వాత పర్సనల్ ఫొటోలు పంపించమని అడిగాడు. రైల్వే కోడూరు ఎమ్మెల్యేనంటూ నన్ను బెదిరించాడు. నీ ట్రాన్స్‌ఫర్,ప్రమోషన్ నా చేతిలోనే ఉంటుందని బెదిరించాడు. మా ఇంటికి వచ్చి వాహనంలో తీసుకెళ్లాడు. మార్గం మధ్యలో ఓ ఇంటి వద్ద ఆపాడు. నేను,నా బాబు మాత్రమే ఉండటం ఆయనకు ఆసరా అయ్యింది. బలవంతపు రిలేషన్‌షిప్ ఎందుకని ప్రశ్నిస్తే బెదిరించారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని వాపోయారు.


