అమరావతి: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు చెందిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. అసెంబ్లీ సమావేశం జరుగుతుంటే మహిళతో వీడియో చాటింగ్ చేస్తున్న వ్యవహారం తాజాగా బయటపడింది. అసెంబ్లీ ప్రతిష్టను దిగజార్చి మరీ మహిళకు వీడియో కాల్ చేశారు. అసెంబ్లీ ప్రాంగణం నుంచే మహిళకు వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో బాధితురాలు మీడియాకు విడుదల చేసింది. అసెంబ్లీ చరిత్రలో ఎవరూ చేయని గలీజు పని చేశారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. అసెంబ్లీ ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా శ్రీధర్ వీడియో కాల్ చేయడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
కాగా, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వికృత చేష్టలను తెలియజేసే వీడియోలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వాటిలో ఆయన చేసిన అసభ్యకర మెసేజ్‌లు, ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్, లైంగిక వేధింపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాత్రి వేళ కారు డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్న శ్రీధర్ మహిళా ఉద్యోగినికి వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించిన వీడియో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
తాను అర్ధనగ్నంగా మారి వీడియో కాల్ చేయడమే కాకుండా.. మహిళను సైతం నగ్నంగా కనిపించాలంటూ బెదిరించారు. పత్రికల్లో రాయలేని అసభ్యకర సందేశాలను బాధితురాలికి అర్ధరాత్రి సమయంలో శ్రీధర్ పంపించినట్లు ఆ వీడియోలో ఉంది. కాగా, శ్రీధర్ తననే కాకుండా కనిపించిన ప్రతి మహిళనూ వక్ర బుద్ధితోనే చూస్తాడని బాధిత మహిళ తెలిపారు.
వివిధ విభాగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులను, సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే మహిళలను, స్నేహితులు, బంధువుల భార్యలను కూడా కామంతోనే చూసేవాడని.. వారి శరీరాకృతుల గురించి తన వద్ద అసభ్యంగా మాట్లాడేవాడని బాధితురాలు వివరించారు. వావి వరుసలు కూడా చూసేవాడు కాదని ఆమె వెల్లడించారు. ఎమ్మెల్యే శ్రీధర్ అరాచకాలను వివరిస్తూ నారావారిపల్లెలో సీఎం చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె వాపోయారు. తాజాగా ఓ మహిళతో అసెంబ్లీ వేదికగా చాటింగ్ చేస్తున్న వీడియో బయట పడటంతో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మానసిక దారిద్ర్యంపై విమర్శల వర్షం కురుస్తోంది.
ఇవీ చదవండి


