వీడియో కాల్‌లో కూటమి ఎమ్మెల్యే శ్రీధర్ బ్లాక్‌మెయిల్
లేదంటే చచ్చిపోతానంటూ మహిళకు పదే పదే బెదిరింపులు, వేధింపులు
అర్ధరాత్రి సమయంలో వాట్సాప్‌లో అసభ్యకర మెసేజ్‌లు
అరవ ఆగడాలపై మరికొన్ని వీడియోలు వెలుగులోకి..
సాక్షి, అమరావతి: కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వికృత చేష్టలను తెలియజేసే మరికొన్ని వీడియోలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో ఆయన చేసిన అసభ్యకర మెసేజ్‌లు, ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్, లైంగిక వేధింపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాత్రి వేళ కారు డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్న శ్రీధర్ మహిళా ఉద్యోగినికి వీడియో కాల్ చేశారు.
‘నువ్వు వద్దంటే చచ్చిపోతాను.. నువ్వు లేకుండా ఉండలేను’ అంటూ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేశారు. మరో వీడియోలో శ్రీధర్ అర్ధరాత్రి వరకు చేసిన వాట్సాప్ మెసేజ్‌లు బయటపడ్డాయి. ఆమె వద్దని ఎంతగా వారించినా ఆయన ఏ మాత్రమూ వినిపించుకోలేదు. వీడియో కాల్ చేసి ఆమెను ‘నైటీ తీసెయ్’ అంటూ బలవంతం చేశారు. బాధిత మహిళ ప్రతిఘటించినా.. ఎమ్మెల్యే వెనక్కి తగ్గలేదు.
తాను అర్ధనగ్నంగా మారి వీడియో కాల్ చేయడమే కాకుండా.. మహిళను సైతం నగ్నంగా కనిపించాలంటూ బెదిరించారు. పత్రికల్లో రాయలేని అసభ్యకర సందేశాలను బాధితురాలికి అర్ధరాత్రి సమయంలో శ్రీధర్ పంపించినట్లు ఆ వీడియోలో ఉంది. కాగా, శ్రీధర్ తననే కాకుండా కనిపించిన ప్రతి మహిళనూ వక్ర బుద్ధితోనే చూస్తాడని బాధిత మహిళ తెలిపారు.
వివిధ విభాగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులను, సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే మహిళలను, స్నేహితులు, బంధువుల భార్యలను కూడా కామంతోనే చూసేవాడని.. వారి శరీరాకృతుల గురించి తన వద్ద అసభ్యంగా మాట్లాడేవాడని బాధితురాలు వివరించారు. వావి వరుసలు కూడా చూసేవాడు కాదని ఆమె వెల్లడించారు. ఎమ్మెల్యే శ్రీధర్ అరాచకాలను వివరిస్తూ నారావారిపల్లెలో సీఎం చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె వాపోయారు.
వీడు కుక్కను చూసినా వదిలిపెట్టడు
ఎమ్మెల్యే శ్రీధర్‌పై కూటమి నాయకుడుతాతంశెట్టి నాగేంద్ర
రైల్వేకోడూరు అర్బన్: ‘‘వీడు కుక్కను చూసినా వదిలిపెట్టడు అని నాకు అర్థమైంది’ అంటూ రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీధర్‌పై కూటమి పార్టీ నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర వ్యాఖ్యానించిన వాయిస్ కాల్ గురువారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. బాధితురాలితో మాట్లాడినట్టు ఉన్న ఆ కాల్‌లో ‘‘మీరేదైనా మాట్లాడాలనుకున్నప్పుడు నాతో చెప్పండి. నేను మాట్లాడుతాను. శ్రీధర్‌కు చపలత్వం ఎక్కువ. రాంగ్‌ట్రాక్‌లో పోతున్నాడు.
మనోడు ఇన్‌స్టాలో వచ్చిన మెసేజ్‌లకూ తప్పుగా స్పందించాడు. పిల్ల చేష్టలు. వాళ్ల పెద్దోళ్లకు కూడా నీ గురించి చెప్పా. మీవాడికి చపలత్వం ఎక్కువుంది జాగ్రత్త అని చెప్పా..’’ అంటూ తాతంశెట్టి బాధితురాలికి సర్దిచెప్పారు. దీనికి బాధితురాలు దీటుగా బదులివ్వడంతో ‘‘వీడు(శ్రీధర్) కుక్కను చూసినా వదిలి పెట్టడు అని నాకు అర్థమైంది’’ అంటూ ఫోన్ పెట్టేశారు.


