breaking news
Female employee
-
బట్టలిప్పి ఫోన్ చెయ్యి..
సాక్షి, అమరావతి: కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వికృత చేష్టలను తెలియజేసే మరికొన్ని వీడియోలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో ఆయన చేసిన అసభ్యకర మెసేజ్‌లు, ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్, లైంగిక వేధింపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాత్రి వేళ కారు డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్న శ్రీధర్ మహిళా ఉద్యోగినికి వీడియో కాల్ చేశారు. ‘నువ్వు వద్దంటే చచ్చిపోతాను.. నువ్వు లేకుండా ఉండలేను’ అంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. మరో వీడియోలో శ్రీధర్ అర్ధరాత్రి వరకు చేసిన వాట్సాప్ మెసేజ్‌లు బయటపడ్డాయి. ఆమె వద్దని ఎంతగా వారించినా ఆయన ఏ మాత్రమూ వినిపించుకోలేదు. వీడియో కాల్ చేసి ఆమెను ‘నైటీ తీసెయ్’ అంటూ బలవంతం చేశారు. బాధిత మహిళ ప్రతిఘటించినా.. ఎమ్మెల్యే వెనక్కి తగ్గలేదు. తాను అర్ధనగ్నంగా మారి వీడియో కాల్ చేయడమే కాకుండా.. మహిళను సైతం నగ్నంగా కనిపించాలంటూ బెదిరించారు. పత్రికల్లో రాయలేని అసభ్యకర సందేశాలను బాధితురాలికి అర్ధరాత్రి సమయంలో శ్రీధర్ పంపించినట్లు ఆ వీడియోలో ఉంది. కాగా, శ్రీధర్ తననే కాకుండా కనిపించిన ప్రతి మహిళనూ వక్ర బుద్ధితోనే చూస్తాడని బాధిత మహిళ తెలిపారు. వివిధ విభాగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులను, సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే మహిళలను, స్నేహితులు, బంధువుల భార్యలను కూడా కామంతోనే చూసేవాడని.. వారి శరీరాకృతుల గురించి తన వద్ద అసభ్యంగా మాట్లాడేవాడని బాధితురాలు వివరించారు. వావి వరుసలు కూడా చూసేవాడు కాదని ఆమె వెల్లడించారు. ఎమ్మెల్యే శ్రీధర్ అరాచకాలను వివరిస్తూ నారావారిపల్లెలో సీఎం చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె వాపోయారు. -
కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నాపై లైంగిక దాడి చేశారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ కూటమి పాలనలో విచ్చలవిడిగా సాగుతున్న అకృత్యాలు, అరాచకాలతో సామాన్యులకు, ముఖ్యంగా మహిళల భద్రతకు దిక్కులేకుండా పోయింది. సాక్షాత్తూ కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులే కీచకులుగా మారిపోయి పశువుల మాదిరిగా బరి తెగించి మహిళలపై నిర్భీతిగా లైంగిక దాడులకు తెగబడటం నివ్వెరపరుస్తోంది. తాజాగా తిరుపతి జిల్లా రైల్వేకోడూరు కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం సర్వత్రా కలకలం రేపుతోంది. బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధిగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కామ పిశాచిలా మారిపోయి ఓ వివాహితను దారుణంగా వేధించి దౌర్జన్యాలకు తెగబడటం పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు ఏడాదిన్నరగా ఈ అకృత్యాన్ని భరిస్తూ వచ్చిన బాధితురాలు ఇక తట్టుకోలేక ఈ దారుణాన్ని సెల్ఫీ వీడియో ద్వారా మంగళవారం బహిర్గతం చేశారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనతో జరిపిన నికృష్టమైన చాటింగ్‌లు, అసహ్యం పుట్టించే నగ్న వీడియోలను సాక్ష్యాధారాలుగా చూపించారు. ఈ కీచక పర్వంపై బాధితురాలు వెల్లడించిన వివరాలు ఇవీ.. జుట్టు పట్టుకుని కొట్టి.. కారులో రేప్ చేశారు! నేను రైల్వే కోడూరు ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నా. ఎన్నికల అనంతరం 2024 జూన్ 14న స్థానిక ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు అభినందనలు తెలుపుతూ ఫేస్బుక్ ద్వారా ఓ మెసేజ్ పెట్టా. టెలిగ్రామ్ యాప్‌లో మాట్లాడదామంటూ ఆయన నాకు అందులో మళ్లీ మెసేజ్ చేశారు. నా గురించి వివరాలు తెలుసుకున్నారు. నా ఫోన్ నెంబర్ తీసుకుని, ఆయన నెంబర్ నాకు ఇచ్చారు. నా భర్త నాకు దూరంగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని, నువ్వు ఒంటరివి కాదు.. నీకు నేనున్నానంటూ హామీ ఇచ్చారు. మొదటి రోజే రెండు మూడు గంటలు పాటు మాట్లాడారు. రెండు రోజులకే వీడియో కాల్ చేసి నగ్నంగా చూపించాలని (న్యూడ్స్) నన్ను అడిగారు. అది కరెక్ట్ కాదని చెప్పినా వినకుండా బెదిరించి, బలవంతం చేశారు. నువ్వొక చిన్న ఉద్యోగివి.. నీమీద ఎంక్వైరీ వేస్తాం.. నీ కుమారుడితో ఒంటరిగా ఉంటున్నావు.. నీ కుమారుడికి ఏమైనా అయితే తరువాత నన్ను అడగొద్దు.. జాగ్రత్త! అంటూ భయపెట్టారు. నీ భవిష్యత్తు నాశనం కాకూడదంటే నన్ను కలిసి తీరాల్సిందేనని హెచ్చరించారు. దీంతో నేరుగా కలసి ఆయనకు అర్థం అయ్యేలా చెప్పాలనే ఉద్దేశంతో 2024 జూలై 9న మొదటిసారి కలిశా. మా ఇంటి దగ్గరకు వచ్చి నన్ను కారులో తీసుకెళ్లారు. కడప మార్గంలో రాజంపేట దగ్గర నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆపి నన్ను లైంగికంగా వేధించారు. నేను వద్దంటూ వారించి, విడిపించుకోవడానికి ఎంతగా ప్రయత్నం చేసినా, కారు డోర్ తెరిచి తప్పించుకోవాలని ప్రయత్నించినా కుదరలేదు. నేను అరుస్తుంటే జుట్టు పట్టుకుని గట్టిగా కొట్టి కారులోనే రేప్ చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేస్తానని హెచ్చరించారు. ఆ తరువాత మళ్లీ మళ్లీ నన్ను కలుస్తూనే ఉన్నారు. ఐదుసార్లు గర్భం తీయించారు.. ఆగస్టులో నాకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వల్ల గర్భం రావడంతో అబార్షన్ చేయించుకోమని చెప్పారు. రెండు మూడు రోజులు బెదిరించిన తరువాత నా భర్తకు విడాకులు ఇస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మించారు. రెండు నెలలు వరకూ అబార్షన్ చేయించుకోకపోవడంతో ఇంటికి వచ్చి నన్ను బాగా కొట్టేవారు. ఆ తరువాత అబార్షన్ చేయించుకున్నా. అలా ఏడాదిన్నరలో ఐదుసార్లు అబార్షన్ చేయించారు. నాకు ఇష్టం లేదని చెప్పినా వినకుండా బయటకు తీసుకువెళ్లడం లేదా ఇంటికి వచ్చి నన్ను లైంగికంగా వాడుకున్నారు. నేను ఇంటి తలుపులు తెరవకపోతే ఎమ్మెల్యే అని కూడా మర్చిపోయి గుమ్మం ముందు నిలబడే ఉండేవారు. అంతేకాకుండా నా భర్త, కుటుంబ సభ్యుల వివరాలు, ఫోన్ నెంబర్లు తెలుసుకుని వారికి ఫోన్లు చేశారు. నాకు విడాకులు ఇవ్వాలని నా భర్తకు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో అందరూ నా నుంచి దూరమైపోయారు. నా బిడ్డ కూడా గత ఆరు నెలలుగా నాతో లేడు. ఇలా నన్ను అన్ని విధాలుగా ఒంటరిని చేసిన తరువాత.. నన్ను పెళ్లి చేసుకోవడం కుదరని, దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించారు. ఏడాదిన్నరగా నన్ను వేధించి, వాడుకుని ఇప్పుడు వదిలేస్తానంటున్నారు. ఆయన స్నానం చేస్తున్నప్పుడు కూడా నేను వీడియో కాల్ చేయాలనేవారు. నన్ను నగ్నంగా చూడాలనేవారు. నాతోనే కాకుండా ఆ ఎమ్మెల్యే ఇలా చాలా మంది మహిళలను వేధించారు. నాకు న్యాయం కావాలి! -
అరవ అ‘రాస’కత్వాలెన్నో..
సాక్షి, అమరావతి: రైల్వే కోడూరు కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకత్వం అంతా ఇంతా కాదని, అతని చేతిలో లైంగిక వేధింపులకు ఎందరో గురయ్యారని బాధిత మహిళా ఉద్యోగిని విమర్శించారు. శ్రీధర్ తల్లి తనపై చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. శ్రీధర్ తననే కాకుండా మరికొందరు కాలేజ్ అమ్మాయిలనూ లైంగికంగా వేధించారని, వారిని లోబరుచుకోవడానికి యత్నించారని ఆమె వెల్లడించారు. ఆ విషయాన్ని కూటమి నేత తాతంశెట్టి నాగేంద్ర స్వయంగా తనతో ఫోన్లో చెప్పారని, ఇప్పుడు అదే నేత తనను తప్పుపడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఆమె ఏమన్నారంటే.. శ్రీధర్ తల్లి, కూటమి నేత తాతంశెట్టి నాగేంద్ర విలేకరుల సమావేశం పెట్టి, నేను చూపించిన వీడియోలు డీప్ ఫేక్ అని అంటున్నారు. ఇదే నాగేంద్ర నాలుగు రోజల కిందట నాకు ఫోన్ చేసి మాట్లాడారు. అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల గురించి మరిన్ని వివరాలు నాగేంద్ర నాతో చెప్పారు. ‘‘శ్రీధర్ నిన్ను మోసం చేశాడు. నిన్నే కాదు నా కొడుకు చదివే కాలేజీలో ఉండే అమ్మాయిలు కూడా కంగ్రాట్స్ చెప్పడానికి మెసేజ్ చేస్తే వాళ్లతో కూడా రాంగ్ ట్రాక్ నడిపాడు. డీప్ ఫ్లర్ట్ చేశాడు’’ అని అన్నారు. నా దగ్గర ఆ కాల్ రికార్డింగ్ ఉంది. అంతేకాదు ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్ చేయాలని నాకు మెసేజ్ కూడా చేశారు. శ్రీధర్ కూడా అవన్నీ ఫేక్ వీడియోలు అని కౌంటర్ వేశారు. నా సెల్‌ఫోన్‌ను తీసుకుని అందులో ఉన్న ఈ వీడియోలు ఒరిజనల్ అవునో కాదో పోలీసులు పరిశీలిస్తే తేలుతుంది. ఏడాదిన్నరగా బయటకు రాకపోవడానికి కారణం.. ముందు నేను శ్రీధర్ తల్లిదండ్రులు, మాజీ ఎమ్మెల్యే రూపానంద రెడ్డితో మాట్లాడాను. కానీ నేను ఏం చెప్పినా వారు అతనిని మందలించకుండా, అతనిని కాపాడటం కోసం నన్ను తప్పుపడుతున్నారు. ఎలాంటి విచారణకైనా నేను కూడా సిద్ధంగా ఉన్నాను. నాకు న్యాయం జరిగే వరకూ పోరాడతాను.అరెస్టు చేసే దమ్ముందా? అమ్మా.. హోంమంత్రి అనితమ్మా.. ఈ దారుణమైన మీ కూటమి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ని అరెస్ట్ చేసే దమ్ముందా? లేదా? ఈ బాధితురాలికి న్యాయం చేసే బాధ్యత మీకు ఉందా? లేదా? – వరుదు కల్యాణి, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సీఎం, డిప్యూటీ సీఎం నోరు విప్పాలిరాష్ట్రంలో మహిళలకు, మహిళా ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందనడానికి కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మహిళా ఉద్యోగినిపై చేసిన లైంగిక దాడి ప్రత్యక్ష నిదర్శనం. దీనిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ఏం సమాధానం చెబుతారు. వారు నోరు విప్పాలి. – పాముల పుష్పశ్రీవాణి, మాజీ డిప్యూటీ సీఎం మహిళలకు రక్షణ లేదు ఎవరైనా మహిళల జోలికి వస్తే అదే చివరి రోజు అని మాట్లాడిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఒకటి మాత్రం వాస్తవం. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. – విడదల రజిని, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అకృత్యాలపై మౌనమేల? ప్రజాప్రతినిధులే మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారంటే రాష్ట్రంలో ఎంతటి దుస్థితి నెలకొందో చెప్పాల్సిన పనిలేదు. కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అకృత్యాలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ఎందుకు మౌనంగా ఉన్నారు? – రోజా, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత -
మహిళా ఉద్యోగిపై జనసేన నాయకుల అమానుషత్వం
తణుకు అర్బన్: తనపై పెట్టిన ప్రైవేటు కేసును ఉపసంహరించుకోవాలని చిన్ని అనే జనసేన నాయకుడు మరో సహచర నాయకునితో కలిసి ఒక మహిళా ఉద్యోగినిపై అమానుషత్వం ప్రదర్శించిన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె, తాజాగా తనకు ప్రాణభయం ఉందని వాపోతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి బాధితురాలు తెలిపిన వివరాలు పరిశీలిస్తే, పంచాయతీ బిల్లు కలెక్టర్‌గా కాంట్రాక్టు పద్ధతిలో నీలం వెంకటలక్ష్మి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతేడాది జూలైలో ఆమె బావ నరసింహస్వామి అలియాస్ అంతర్వేదికి– జనసేన దువ్వ అధ్యక్షుడు శ్రీరాములు దుర్గారావు అలియాస్ చిన్నికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో అంతర్వేదికి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. అప్పట్లో దీనిపై కేసు నమోదైంది. సదరు కేసును వెనక్కి తీసుకునేలా అంతర్వేదిని ఒప్పించాలని చిన్ని, జనసేన పార్టీ తణుకు మండల అధ్యక్షుడు చిక్కాల వేణుతో కలిసి ఆమెపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేధింపులు మరింత తీవ్రమయ్యాయి. తలుపులు వేసి మరీ దుర్భాషలు..ఈ నేపథ్యంలో మార్చి 28న ఫీల్డులో ఉన్న వెంకటలక్ష్మిని పంచాయతీ కార్యాలయానికి రావాల్సిందిగా జనసేన నాయకులు ఫోన్ చేశారు. పంచాయతీ కార్యాలయానికి వచ్చిన తరువాత ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని పట్టుబట్టారు. అయితే ఆ ఫిర్యాదుతో తనకు సంబంధం లేదని, అంతర్వేదితోనే మాట్లాడుకోమని ఆమె చెప్పారు.దీంతో రెచ్చిపోయిన నాయకులు ఇరువురు తలుపులు వేసి మరీ చెప్పుకోలేని విధంగా దుర్భాషలాడారు. దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు విచారిస్తున్నట్లు తణుకు రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. కాగా, ఇటీవలి కాలంలో దువ్వ పంచాయతీ కార్యాలయాన్ని కూటమి పార్టీ కార్యాలయంగా మారుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
శరీరాకృతిపై వ్యాఖ్యలూ లైంగిక వేధింపులే
కొచ్చి: మహిళ రూపురేఖలను వర్ణిస్తూ ద్వంద్వార్థం ధ్వనించేలా వ్యాఖ్యలు చేసినా, ఎస్ఎంఎస్ సందేశాలు పంపినా లైంగిక వేధింపుల సెక్షన్ల కింద అవి నేరంగా పరిగణించబడతాయని కేరళ హైకోర్టు స్పష్టంచేసింది. ఒకే కార్యాలయంలో పనిచేసిన కాలంలో తోటి మహిళా ఉద్యోగిపై తాను చేసిన వ్యాఖ్యల కుగాను నమోదైన లైంగిక వేధింపుల కేసులను కొట్టేయాలంటూ కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డ్ మాజీ ఉద్యోగి చేసిన అభ్యర్థనను జస్టిస్ ఏ.బధారుద్దీన్ సారథ్యంలోని ధర్మాసనం కొట్టేసింది. ఎర్నాకులం జిల్లాలో కేఎస్ఈబీ ఆఫీస్‌లో పనిచేసిన కాలంలో 2013 ఏడాది నుంచి తనతో అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని, 2016–17 కాలంలో మొబైల్ ఫోన్‌కు తన రూపురేఖలను వర్ణిస్తూ ఎస్ఎంఎస్లు పంపారని, వాయిస్ కాల్స్ చేశారని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఆ తర్వాత సైతం అతని నుంచి ఎస్ఎంఎస్లు, ఫోన్‌కాల్స్ ఆగలేదు. దీంతో భారత శిక్షాస్మృతిలోని 354(ఏ)(1)(4), 509 సెక్షన్లతోపాటు కేరళ పోలీస్ చట్టంలోని 120(ఓ) సెక్షన్ కింద సదరు ప్రభుత్వ ఉద్యోగిపై కేసు నమోదైంది. అందంగా ఉందని మాత్రమే ఎస్ఎంఎస్లు పంపానని, ఆ సందేశాల్లో ఎలాంటి తప్పుడు ఉద్దేశంలేదని అతని తరఫు న్యాయవాది చేసిన వాదనలను కోర్టు తిరస్కరించింది. లైంగిక వేధింపుల సెక్షన్లను తొలగించాలంటూ ఆ ఉద్యోగి వేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ జడ్జి తీర్పు చెప్పారు. -
వడ్డీ వ్యాపారి లైంగిక వేధింపులు
గుంటూరు: వడ్డీకి డబ్బులు తీసుకుంటే.. ఆ వడ్డీ వ్యాపారి, తనకు పరిచయస్తుడైన వ్యక్తితో కలసి లైంగిక వేధింపులకు దిగడంతో సోమవారం ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేసింది. గుంటూరు కలెక్టరేట్లోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో షేక్ అజీమున్నీసా సీనియర్ అసిస్టెంట్. 2009లో భర్త హుసేన్ మరణానంతరం ఆమెకు ఉద్యోగం వచ్చింది. ఇద్దరు పిల్లల చదువు నిమిత్తం స్వగ్రామం నరసరావుపేటకు చెందిన ఇన్నమూరి మాధవరావు ద్వారా వడ్డీ వ్యాపారి మట్టా ప్రసాదు వద్ద రూ.5 వడ్డీకి రూ.3 లక్షలు అప్పు తీసుకుంది. ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులిచ్చింది. ప్రతి నెలా రూ.15 వేలు వడ్డీ చెల్లిస్తోంది. అయినా వారిద్దరూ ఒత్తిడి చేసి ఏటీఎం కార్డు కూడా తీసుకున్నారు. రెండున్నరేళ్లలో రూ.8 లక్షలు డ్రా చేసుకున్నా.. అప్పుతీరలేదంటూ కోర్టులో కేసు వేశారు. కేసు తొలగించాలన్నా తమ కోరిక తీర్చాలని వేధిస్తున్నారు. దీనిపై రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అనంతరం డీపీవో ఆవరణలోని క్యాంటీన్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో పడివున్న ఆమెను జీజీహెచ్‌కు తరలించారు. వడ్డీ వ్యాపారి వేధింపుల విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ సీహెచ్ విజయారావు వెంటనే నిందితులను అదుపులోకి తీసుకొని బాధితురాలికి అండగా నిలవాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వడ్డీ వ్యాపారుల వివరాలను సేకరించాలని కిందిస్థాయి అధికారులకు సూచించారు. -
మహిళా ఉద్యోగినిపై దుర్భాషలాడిన ఏఎస్ఓ అధికారి
సాక్షి, తూర్పుగోదావరి : ఏఎస్ఓ అధికారి మహిళ ఉద్యోగిని పట్ల అనుచితంగా ప్రవర్తించమే గాక తీవ్రంగా దుర్భాషలాడిన ఘటన గురువారం జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రసన్న కుమారి పౌర సరఫరా శాఖలో మహిళా ఉద్యోగినిగా పనిచేస్తుంది. అదే కార్యాలయంలో పీతల సురేష్ ఏఎస్ఓగా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సురేష్ ప్రసన్నకుమారి పట్ల అనుచిత వాఖ్యలు చేయడమే గాక తీవ్రంగా దుర్భాషలాడాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రసన్న కుమారి బంధువులు డిఎస్వో చాంబర్లో సురేష్ పై దాడికి యత్నించగా అక్కడే ఉన్న డిఎస్వో ప్రసాదరావు వారికి సర్దిచెప్పి పంపిచేశారు. కాగా, ఈ ఘటనను ఖండించిన మహిళా సంఘాలు సురేష్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించాయి. -
బీఎస్ఎన్ఎల్ తీరుపై హైకోర్టు ఆక్షేపణ
- మరణించిన ఉద్యోగి ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వని అధికారులు - వడ్డీతో సహా చెల్లించాలని అధికారులకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: మృతి చెందిన ఓ మహిళా ఉద్యోగికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలను ఆమె కుటుంబ సభ్యులకు అందచేసే విషయంలో బీఎస్ఎన్ఎల్ అధికారులు వ్యవహరించిన తీరును ఉమ్మడి హైకోర్టు తప్పు పట్టింది. ఆర్థిక ప్రయోజనాలు అందుకోవాలంటే మృతురాలితో ఉన్న బంధుత్వానికి సంబంధించి కోర్టు నుంచి వారసత్వ ధృవీకరణ పత్రం తీసుకురావాల్సిందేనని ఆమె భర్త, కుమారుడిని బీఎస్ఎన్ఎల్ అధికారులు ఒత్తిడి చేయడంపై మండిపడింది. మృతురాలికి చెందిన ఆర్థిక ప్రయోజనాలన్నింటినీ వడ్డీతో సహా ఆమె భర్త, కుమారుడికి చెల్లించాలని అధికారులను ఆదేశించింది. బీఎస్ఎన్ఎల్ వద్ద మృతురాలి భర్త, కుమారుడు ఎవరనే వివరాలు స్పష్టంగా ఉన్నా, మళ్లీ వారసత్వ ధృవీకరణ పత్రం తీసుకురావాలనడంలో ఔచిత్యమేమిటో అర్థం కావడం లేదని పేర్కొంది. ఆర్థిక ప్రయోజనాల చెల్లింపు విషయంలో కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. క్యాట్ ఉత్తర్వులను సవాలు చేస్తూ బీఎస్ఎన్ఎల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ నక్కా బాలయోగితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. పి.లక్ష్మీసామ్రాజ్యం బీఎస్ఎన్ఎల్లో సూపర్ వైజర్‌గా పనిచేస్తూ మృతి చెందారు. ఆమెకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ఇవ్వకపోవడంతో ఆమె భర్త, కుమారుడు క్యాట్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన క్యాట్... ఆమె భర్త, కుమారుడికి ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వాలని బీఎస్ఎన్ఎల్ అధికారులను ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై బీఎస్ఎన్ఎల్ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన ధర్మాసనం.. బీఎస్ఎన్ఎల్ అధికారుల తీరును తప్పుపడుతూ తీర్పునిచ్చింది. -
మహిళా ఉద్యోగిపై దాడి
lపరిస్థితి ఆందోళనకరం పోలీసు స్టేషన్లో లొంగిపోయిన భర్త విధులు ముగించుకుని ఇంటికి బయల్దేరిన డీజిల్‌షెడ్ కార్యాలయ సూపరింటెండెంట్ సుకన్య (37)పై గుర్తు తెలియని వ్యక్తులు వేటకొడవళ్లు, కత్తులతో దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.... పట్టణంలోని డీఆర్ఎం కార్యాలయం పర్సనల్ బ్రాంచ్ విభాగంలో పని చేస్తున్న సుకన్య నాలుగు రోజుల కిందట డీజిల్‌షెడ్‌కు బదిలీ అయ్యారు. సోమవారం సాయంత్రం డ్యూటీ ముగించుకొని ఇంటికి బయలుదేరారు. ఆర్పీఎఫ్ చెక్‌పోస్టు వద్దకు రాగానే కాపు కాచిన నలుగురైదుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై మారణాయుధాలతో దాడి చేశారు. ముఖం, చేయి, కుడికాలు, కడుపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. కొన ఊపిరితో ఉన్న ఆమెను సహోద్యుగులు సమీపంలోని రైల్వే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు. రూరల్ సీఐ గురుప్రసాద్, వన్‌టౌన్ ఎస్ఐ నగేష్‌బాబులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే ఉద్యోగులతో ఆస్పత్రి కిటకిట విషయం తెలుసుకున్న ఏడీఆర్ఎం సుబ్బరాయుడు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు రైల్వే ఆస్పత్రికి తరలివచ్చారు. సీనియర్ డీఎంఈ (డీజిల్) గోపాల్, డీపీఓ మాలతి, మజ్దూర్ యూనియన్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎస్.విజయ్‌కుమార్, ఎంప్లాయీస్ సంఘ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి కే.ప్రభాకర్ తదితరులు సుకన్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆర్పీఎఫ్ కమాండెంట్ ఎలీషా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రాణహానిపై వారం కిందటే ఫిర్యాదు రైల్వే ఉద్యోగి సుకన్య 13 ఏళ్ల కిందట రఘు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. వీరి మధ్య సఖ్యత లేకపోవడంతో వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. ప్రస్తుతం రఘు ఇద్దరు పిల్లలతో వేరు కాపురముంటున్నాడు. రఘు తరచూ ఆమె పని చేసే కార్యాలయం వద్దకు వెళ్లి గొడవ పడుతుండేవాడని తెలిసింది. భర్త వల్ల తనకు ప్రాణహాని ఉందని సుకన్య వారం రోజుల కిందట వన్‌టౌన్ పోలీసుస్టేçÙన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కసారిగా మారణాయుధాలతో కొందరు సుకన్యపై దాడిచేశారు. కొన ఊపిరితో పోరాడుతున్న సుకన్య భర్త రఘు పేరు చెబుతుండటంతో సహా ఉద్యోగులు, స్థానికులు పోలీసులకు తెలిపారు. లొంగిపోయిన భర్త: సుకన్య భర్త రఘు రాత్రి పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. తన భార్యపై తానే హత్యాయత్నం చేయించినట్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. -
సీఐడీ సీఐ దయాకర్‌రెడ్డి అరెస్టు
కరీంనగర్ క్రైం: మహిళను వేధింపులకు గురిచేసిన కేసులో సీఐడీ సీఐ దయాకర్‌రెడ్డి అరెస్టయ్యూరు. సోమవారం పోలీసులు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. కరీంనగర్ కలెక్టరేట్లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి భర్త చనిపోవడంతో తన కుమారుడితో కలిసి స్థానిక శ్రీనగర్‌కాలనీలోని నివాసం ఉం టోంది. ఏఎస్సై మోహన్‌రెడ్డికి సమీప బంధువైన ఆమెను అక్రమ ఫైనాన్స్ వ్యవహారంలో సీఐడీ అధికారులు విచారణ కోసం పిలిపించారు. సీఐడీలో విచారణ అధికారిగా ఉన్న సీఐ దయాకర్‌రెడ్డి మహిళ ఫోన్ నంబరు తీసుకుని తరచూ ఫోన్లు చేసి వేధించడం ప్రారంభించాడు. వాట్సప్‌లోనూ పలు మెసేజ్‌లు పెట్టాడు. ఇవి శ్రుతిమించడంతో భరించలేని మహిళ ఈ నెల 2న కరీంనగర్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎమ్మెస్‌లు, వాట్సప్ మెసేజ్‌ల ఆధారంగా కరీంనగర్ టుటౌన్ పోలీసులు సీఐడీ సీఐ దయాకర్‌రెడ్డిపై నిర్భయ కేసు నమోదు చేశారు. అనంతరం మహిళ నుంచి ఫోన్ స్వాధీనం చేసుకుని నిర్ధారణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఈ మేరకు నివేదికలను ఉన్నతాధికారులకు పంపడంతో ఈ నెల 4న సీఐ దయాకర్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటువేశారు. అనంతరం పోలీసులకు అందుబాటులో లేకుండా పోయిన దయాకర్‌రెడ్డిని సోమవారం అరెస్టు చేసి జిల్లా అదనపు జూడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ మాధవి ముందు హాజరుపరిచారు. ఆయన 14 రిమాండ్ విధించిన అనంతరం... ఇద్దరి పూచీకత్తుపై బెరుుల్ మంజూరు చేశారు. -
‘టెరీ’ చీఫ్‌గా ఆర్కే పచౌరీ తొలగింపు
బెంగళూరు: మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టెరీ(ద ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్) డెరైక్టర్ జనరల్ రాజేంద్ర కుమార్ పచౌరీ ఆ పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. బెంగళూరులో గురువారం టెరీ పాలక మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టెరీ నూతన చీఫ్‌గా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) డెరైక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ మాథుర్‌ను నియమిస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. మాథుర్ త్వరలోనే బాధ్యతలు చేపడతారని టెరీ ఒక ప్రకటనలో తెలిపింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై టెరీ అంతర్గత ఫిర్యాదుల కమిటీ నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం దీనిపై కోర్టు స్టే అమలులో ఉందని పేర్కొంది. పర్యావరణ పరిశోధన సంస్థ అయిన టెరీ వ్యవస్థాపకుడిగా ప్రపంచ పర్యావరణవేత్తగా అంతర్జాతీయ ఖ్యాతినొందిన 74 ఏళ్ల పచౌరీ ఒక సీనియర్ ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అపఖ్యాతిపాలయిన సంగతి తెలిసిందే. -
సన్ టీవీ నిర్వాహకుడి అరెస్ట్
టీనగర్: మహిళా ఉద్యోగి ఫిర్యాదుతో సన్ టీవీ నిర్వాహకుడిని క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై అన్నానగర్ ఈస్ట్ బుజుల్లా గార్డెన్ అపార్టుమెంటుకు చెందిన ప్రవీణ్ (51). ఈయన సన్‌టీవీలో నెట్వర్క్ అధికారి. ముంబైకి చెందిన దీపి శివన్ (38) సూర్య టీవీలో ప్రోగ్రామ్ అధికారి. తరువాత ప్రవీణ్ విధుల నుంచి రిలీవ్ అయి ముంబై వెళ్లారు. దీప్తిశివన్ నాలుగు నెలల క్రితం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఒక ఫిర్యాదు చేశారు. అందులో తనకు రావాల్సిన వేతన బకాయిలు 36లక్షలు ఇవ్వకుండా మోసగిస్తున్నారని, తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు సంబంధిత పోలీస్‌స్టేషన్ లో చేసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కొద్ది రోజుల క్రితం దీపిశివన్ చెన్నై సెంట్రల్ క్రైంబ్రాంచ్‌లో మళ్లీ ఒక ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు వెంటనే విచారణ జరపాలని పోలీసు కమిషనర్ జార్జ్ ఉత్తర్వులు ఇచ్చారు. సెంట్రల్ క్రైంబ్రాంచ్ అడిషినల్ కమిషనర్ ఆధ్వర్యంలో డెప్యూటీ కమిషనర్ జయకుమార్ ఆధ్వర్యంలో అడిషినల్ కమిషనర్ శ్యామల దీని గురించి విచారణ జరిపారు. విచారణ తరువాత గురువారం రాత్రి అన్నానగర్ ఇంటిలో ఉన్న ప్రవీణ్‌ను సెంట్రల్ క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈయన్ను కోర్టులో హాజరు పరచి జైలుకు తరలించారు.


