సన్ టీవీ నిర్వాహకుడి అరెస్ట్ | Sun TV COO arrested on sexual harassment charges | Sakshi
Sakshi News home page

సన్ టీవీ నిర్వాహకుడి అరెస్ట్

Dec 27 2014 2:21 AM | Updated on Aug 20 2018 4:44 PM

సన్ టీవీ నిర్వాహకుడి  అరెస్ట్ - Sakshi

సన్ టీవీ నిర్వాహకుడి అరెస్ట్

మహిళా ఉద్యోగి ఫిర్యాదుతో సన్ టీవీ నిర్వాహకుడిని క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై అన్నానగర్ ఈస్ట్ బుజుల్లా గార్డెన్ అపార్టుమెంటుకు చెందిన ప్రవీణ్ (51).

టీనగర్: మహిళా ఉద్యోగి ఫిర్యాదుతో సన్ టీవీ నిర్వాహకుడిని క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై అన్నానగర్ ఈస్ట్ బుజుల్లా గార్డెన్ అపార్టుమెంటుకు చెందిన ప్రవీణ్ (51). ఈయన సన్‌టీవీలో నెట్‌వర్క్ అధికారి. ముంబైకి చెందిన దీపి శివన్ (38) సూర్య టీవీలో ప్రోగ్రామ్ అధికారి. తరువాత ప్రవీణ్ విధుల నుంచి రిలీవ్ అయి ముంబై వెళ్లారు. దీప్తిశివన్ నాలుగు నెలల క్రితం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఒక ఫిర్యాదు చేశారు. అందులో తనకు రావాల్సిన వేతన బకాయిలు 36లక్షలు ఇవ్వకుండా మోసగిస్తున్నారని, తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదు సంబంధిత పోలీస్‌స్టేషన్ లో చేసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కొద్ది రోజుల క్రితం దీపిశివన్ చెన్నై సెంట్రల్ క్రైంబ్రాంచ్‌లో మళ్లీ ఒక ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు వెంటనే విచారణ జరపాలని పోలీసు కమిషనర్ జార్జ్ ఉత్తర్వులు ఇచ్చారు. సెంట్రల్ క్రైంబ్రాంచ్ అడిషినల్ కమిషనర్ ఆధ్వర్యంలో డెప్యూటీ కమిషనర్ జయకుమార్ ఆధ్వర్యంలో అడిషినల్ కమిషనర్ శ్యామల దీని గురించి విచారణ జరిపారు. విచారణ తరువాత గురువారం రాత్రి అన్నానగర్ ఇంటిలో ఉన్న ప్రవీణ్‌ను సెంట్రల్ క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈయన్ను కోర్టులో హాజరు పరచి జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement