తెగిపోయిన చెవిని పాదంపై అతికించారు..! | How Chinese doctors kept a severed ear alive reattached it months later | Sakshi
Sakshi News home page

తెగిపోయిన చెవిని పాదంపై అతికించారు..! ఆ తర్వాత..

Dec 29 2025 5:03 PM | Updated on Dec 29 2025 6:07 PM

How Chinese doctors kept a severed ear alive reattached it months later

అనుకోని ప్రమాదాల్లో బాధితులు అవయవాలు కోల్పోవ‌డం సర్వసాధారణం. ఒక్కోసారి కొన్నిటిని కృత్రిమ అవయవాలతో భర్తి చేస్తే.. కొన్ని సున్నితమైన అవయవాల విషయాల్లో అది అస్సలు సాధ్యం కాదు. ఇక్కడ ఒక్క మహిళ కూడా అలానే ఎడమ చెవిని కోల్పోయింది. అయితే దాన్ని చక్కగా తిరిగి ఆమెకు అతికించేందుకు విన్నూతమైన వైద్యవిధానాన్ని ఉపయోగించారు. తెగిన చెవిని తిరిగి అతికించడం కాస్తం కష్టం. అయితే దాన్ని పాడవ‌కుండా కాపాడి మరి అతికించారు. అది ఏవిధంగానే తెలిస్తే.. ఇదేం వైద్య విధానం అని విస్తుపోతారు.

చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన సన్ అనే మహిళ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె జుట్టు యంత్రంలో చిక్కుకుంది. ఆ వేగానికి తల ఎడమవైపు చర్మంతో సహా చెవి కూడా పూర్తిగా తెగిపోయింది. దాంతో స్థానికులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఆ ప్రమాదంలో సదరు మహిళకు రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అందువల్ల చెవిని తిరిగి అమర్చడం క్లిష్టంగా మారింది. అయితే తెగిపోయిన చెవికి గనుక  రక్తప్రసరణ అందకపోతే అది కుళ్లిపోయే ప్రమాదం ఉంది. 

దాంతో వైద్యులు సాహసోపేతమైన నిర్ణయం తీసుకోక తప్పలేదు. తెగిపోయిన చెవి పాడవ్వకుండా ఉండేలా.. పాదం పైభాగానికి అతికించారు. ఎందుకంటే అక్కడ చర్మం పల్చగా ఉండటమే గాక అక్కడి ఉండే రక్తనాళాలు సరిగ్గా చెవి రక్తనాళాల పరిమాణంలోనే ఉంటాయి. ఆ నేపథ్యంలో పాదానికి చెవిని అతికించారు. అక్కడ తలవెంట్రుకల కంటే సన్నగా ఉండే రక్తనాళాలు ఉండటంతో ఈ క్లిష్టమైన మైక్రో సర్జరీకి సుమారు 10 గంటల సమయం పట్టింది. 

చెవి సురక్షితంగా పెరగడానికి సుమారు ఐదు నెలలు పైనే పట్టింది. ఆ ఐదు నెలలు నిరీక్షణ అనంతరం పాదంపై ఉన్న చెవిని తీసి తల భాగంలో విజయవంతంగా అమర్చారు వైద్యులు. అలాగే ఆ మహిళ తల చర్మాన్ని పునరుద్ధరించడానికి కడుపు నుంచి తీసిన చర్మాన్ని అతికించారు. ఈ సరికొత్త చికిత్సా విధానం విజయవంతం అవ‌డమే గాక సదరు మహిళ సైతం పూర్తిగా కోలుకుంటోంది కూడా. ఇలాంటి శస్త్ర చికిత్సలు చైనాకేం కొత్త కాదు. ఎందుకంటే గతంలో కూడా చైనా వైద్యులు రోగి భుజంపై చెవిని పెంచి అరుదైన రికార్డు క్రియేట్‌ చేశారు. 

చదవండి: భావోద్వేగ మ‌ద్ద‌తుకు పెరుగుతున్న డిమాండ్‌..! ఈ ఏడాదిలోనే ఏకంగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement