చిత్తూరు అర్బన్: ప్రియుడు మోజులో పడ్డ మహిళ తన భర్తను చంపడానికి ప్రయత్నించగా.. ఆమె చూస్తూ ఉండిపోయింది. అదృష్టవశాత్తు భర్త బతికి బయటపడ్డాడు. చిత్తూరు నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి... ఓ మహిళకు తన భర్త స్నేహితుడితో ఏర్పడ్డ పరిచయం చనువుగా మారింది. వీరిద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు.
భర్త అడ్డుగా ఉండడంతో అతడిని తప్పించాలని నిర్ణయించుకున్నారు. భర్త ఇంట్లో నిద్రపోతున్న సమయంలో దిండు తీసుకొని అతని మొహం పై పెట్టి చంపడానికి ప్రియుడు ప్రయత్నించాడు. ఉన్నట్టుండి మెలకువ రావడంతో భర్త ఆ ఘటన నుంచి బయటపడి పోలీసులను ఆశ్రయించాడు. చిత్తూరు పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు.


