విజయవాడలో కాల్పుల కలకలం | Man Attempts To Fire At Police In Vijayawada, Gun Trigger Jams And Major Mishap Averted | Sakshi
Sakshi News home page

విజయవాడలో కాల్పుల కలకలం

Mar 7 2026 10:29 AM | Updated on Mar 7 2026 12:34 PM

Unknown Person Gun Fire At Vijayawada

సాక్షి, విజయవాడ : విజయవాడలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసులపైనే కాల్పులు జరిపేందుకు ఓ దుండగుడు ప్రయత్నించాడు. అయితే, ట్రిగ్గర్‌ బ్లాక్‌ కావడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం, అతడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడలోని బాలాజీ హోటల్‌లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ దుండగుడు పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో గన్‌ ట్రిగ్గర్‌ లాక్‌ కావడంతో బుల్లెట్‌ బయటకు రాలేదు. దీంతో, అక్కడ హైడ్రామా చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. సదరు వ్యక్తిని పట్టుకున్నారు. దుండగుడి వద్ద నుంచి 9 ఎంఎం పిస్టల్‌, ఐదు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, కాల్పులు జరిపిన వ్యక్తిని వరంగంల్‌ జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతడిని ఈగల్‌ టీమ్‌ విచారిస్తున్నట్టు పోలీసులు చెప్పుకొచ్చారు.

 

Advertisement
 
Advertisement
Advertisement