breaking news
Gun Shot
-
కమెడియన్ కపిల్‌శర్మ కేఫ్‌పై కాల్పులు.. వీడియో వైరల్!
బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ కేఫ్‌పై కాల్పులు జరిపారు. కెనడాలోని ఆయన కేఫ్‌పై గుర్తు తెలియని వ్యక్తి గన్‌తో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేఫ్‌ను కపిల్ శర్మ ఇటీవలే ప్రారంభించినట్లు తెలుస్తోంది. కారులో వచ్చిన గుర్తు తెలియిని వ్యక్తి కాల్పులు జరపినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది. కపిల్ శర్మను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందా? కేఫ్ టార్గెట్‌గా చేశారా? అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.కాల్పులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను రితేష్ లఖి అనే జర్నలిస్ట్ ట్విటర్ వేదికగా షేర్ చేశారు. కాగా.. కపిల్ శర్మ ఇటీవల కెనడాలోని సర్రేలో మూడు రోజుల క్రితమే కాప్స్ అనే పేరుతో కేఫ్‌ను ప్రారంభించారు. ఈ కాల్పుల ఘటనపై ఘటనపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఈ సంఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.World Famous comedian Kapil Sharma's newly inaugurated restaurant KAP'S CAFE shot at in Surrey, BC, Canada last night.Harjit Singh Laddi, a BKI operative, NIA's (INDIA ) most wanted terrorist has claimed this shoot out citing some remarks by Kapil@SurreyPolice pic.twitter.com/p51zlxXbOf— Ritesh Lakhi CA (@RiteshLakhiCA) July 10, 2025 -
పాత్రికేయుల ఎదుటే పౌరునిపై పోలీసు కాల్పులు
నైరోబీ: పోలీసుయంత్రాంగం కొన్ని దేశాల్లో కారాగారాలను నరకానికి నఖలుగా మార్చేస్తుంటే మరికొన్ని దేశాల్లో పోలీసులు యమునికి ప్రతిరూపాలు గా అవతరిస్తు న్నారు. కొట్టే అధికారం ఉందనే గర్వంతో లాఠీలతోపాటు తూటాలకూ పనిచెప్పిన ఓ పోలీసు ఉదంతం ఇప్పుడు కెన్యాలో వివాదమైంది. పాత్రికేయుల ఎదుటే ఒక పౌరునిపై పోలీస్ అధికారి అన్యాయంగా తుపాకీ గురిపెట్టిన కాల్చిన ఘటన తాలూకు వీడియో ఇప్పుడు సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మంగళవారం నైరోబీలోని అత్యంత రద్దీగా ఉన్న ఒక రహదారిలో నిరసన ర్యాలీ జరిగింది. జూన్ ఆరో తేదీన ఆల్బర్ట్ ఒజ్వాంగ్ అనే బ్లాగర్ను పోలీసులు లాకప్‌డెత్ చేశారు. పోలీసుపై తప్పుడు కథనం రాశాడని అరెస్ట్‌చేసి పట్టుకొచ్చి చితకబాదడంతో అతను లాకప్‌లో కన్నుమూశాడు. సంబంధిత పోలీసులను అరెస్ట్‌చేయాలంటూ బుధవారం నైరోబీలో నిరసనర్యాలీ జరిగింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జ్చేశారు. అదేసమయానికి మాస్క్‌లను అమ్ముకునే 22 ఏళ్ల వీధి వ్యాపారి బొనిఫేస్ కరియుకీ అటుగా వచ్చాడు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ ఇద్దరు సాయుధ పోలీసులు హెచ్చరించారు. ఉద్యమకారులతో తనకేం సంబంధంలేదని వివరణ ఇచ్చేలోపే ఒక పోలీసు ఇతని తలకు తుపాకీ గురిపెట్టి కాల్చాడు. దీంతో రక్తమోడుతూ కరియుకీ కుప్పకూలాడు. జర్నలిస్టుల ఎదుటే ఈ దారుణం జరిగింది. అదృష్టవశాత్తు అతడికి వెంటనే శస్త్రచికిత్సచేసి బుల్లెట్‌ను తీసేయడంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్సపొందుతున్నాడు. విషయం తెల్సి ఆందోళనకారులు మళ్లీ నిరసనచేపట్టారు. దీంతో చివరకు ఆ అధికారిని అరెస్ట్చేశామని పోలీస్‌విభాగం ఒక ప్రకటన విడుదలచేసింది. -
అమెరికాలో దారుణం.. కాల్పుల్లో భారత్‌కు చెందిన తండ్రీకూతురు మృతి
వర్జీనియా: అగ్రరాజ్యం అమెరికాలో దారుణ ఘటన వెలుగుచూసింది. వర్జీనియాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో భారత్‌కు చెందిన తండ్రీ, కూతురు చనిపోయారు. వీరిని గుజరాత్‌కు చెందిన ప్రదీప్ పటేల్, ఉర్మిగా గుర్తించారు. ఈ క్రమంలో కాల్పులు జరిపిన నిందితుడు ఫ్రేజర్ దేవన్ వార్టన్ (44)ను వర్జీనియా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. ప్రదీప్ పటేల్, ఆయన కూతురు ఉర్మి.. గురువారం రోజున వర్జీనియాలోని అకోమాక్ కౌంటీలో డిపార్ట్మెంటల్ స్టోర్‌కి వెళ్లారు. వారు స్టోర్‌లో ఉన్న సమయంలో నిందితుడు ఫ్రేజర్ దేవన్ వార్టన్ అక్కడికి వెళ్లాడు. తనకు మందు కావాలని అడగడంతో స్టోర్ సిబ్బందికి, అతడికి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం, స్టోర్‌లో ఉన్న వర్కర్లపై నిందితుడు విచక్షణారహితంగా కాల్పలు జరిపాడు. కాల్పుల్లో ప్రదీప్ కుమార్, ఉర్మి తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో ప్రదీప్ కుమార్ ఘటనా స్థలంలోనే మృతిచెందగా.. ఉర్మి తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. అనంతరం, కాల్పులు జరిపిన ఫ్రేజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇదిలా ఉండగా.. గుజరాత్‌లోని మెహసనా జిల్లాకు చెందిన ప్రదీప్ పటేల్.. తన భార్య హన్స్‌బెన్, కుమార్తె ఊర్మితో కలిసి ఆరేళ్ల కిందట అమెరికాకు వెళ్లారు. అక్కడ తన బంధువులకు చెందిన డిపార్ట్మెంటల్ స్టోర్‌లో పనిచేస్తున్నారు. మృతుడు ప్రదీప్ కుమార్‌కు మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. వారిలో ఒకరు అహ్మదాబాద్, ఇంకొకరు కెనడాలో ఉన్నారని చెప్పారు. ప్రదీప్, ఉర్మి మృతితో కుటుంట సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.🚨 Gujarati father, daughter shot dead in US store in Virginia.Pradeep Patel, 56, was shot dead on the spot, while his 24-year-old daughter, Urmi, succumbed to her injuries two days later. pic.twitter.com/RtU2VYqAmv— The Tradesman (@The_Tradesman1) March 23, 2025 -
Afzalgunj Incident: కోలుకున్న ‘బీదర్ క్షతగాత్రుడు’
సాక్షి, సిటీబ్యూరో: కర్ణాటకలోని బీదర్‌లో ‘అఫ్జల్‌గంజ్ దుండగులు’ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన శివకుమార్ నగరంలోని ఓ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఇది తనకు పునర్జన్మ అంటూ చేసిన వీడియోను ఆయన సమీప బంధువు గురువారం విడుదల చేశారు. బీదర్‌లోని శివాజీ సర్కిల్ వద్ద గత గురువారం (ఈ నెల 16) ఉదయం భారీ దోపిడీ చోటు చేసుకుంది. బైక్‌పై వచి్చన ఇద్దరు దుండగులు ఎస్బీఐ ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే సీఎంఎస్ సంస్థకు చెందిన వాహనంపై విరుచుకుపడ్డారు. ఈ వాహనంలో సెక్యూరిటీ గార్డు, గన్‌మెన్ లేకపోవడం వీరికి కలిసి వచ్చింది. కస్టోడియన్లుగా ఉన్న శివకుమార్, గిరి వెంకటే‹Ùలపై తుపాకీతో కాల్పులు జరిపి రూ.83 లక్షలతో ఉన్న అల్యూమినియం బాక్సు ఎత్తుకెళ్లారు. నాలుగు తూటాలు దిగిన వెంకటేష్ అక్కడిక్కడే చనిపోగా... ఛాతిలోకి ఓ తూటా దూసుకుపోయిన శివకుమార్ తీవ్రంగా గాయపడ్డారు. అదే రోజు రాత్రి వారు అఫ్జల్‌గంజ్‌లోని రోషన్ ట్రావెల్స్ నుంచి రాయ్‌పూర్ వెళ్లే ప్రయత్నం చేశారు. ఇక్కడ చోటు చేసుకున్న పరిణామాలతో రోషన్ ట్రావెల్స్ మేనేజర్ జహంగీర్ పైనా కాల్పులు జరిపిన ఇరువురూ పారిపోయారు. బీదర్ పోలీసులు తొలుత శివకుమార్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో వారి సూచన మేరకు మెరుగైన వైద్య సేవల నిమిత్తం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న శివకుమార్ నాటి ఉదంతానికి సంబంధించిన వివరాలు చెబుతుండగా చిత్రీకరించిన ఓ వీడియోను ఆయన సమీప బంధువు శివయోగి కన్నడ మీడియాకు విడుదల చేశారు. అందులో శివకుమార్ చెప్పిన వివరాలివీ... ‘ఆ రోజు నగదు తీసుకుని సీఎంఎస్‌కు చెందిన చెస్ట్ నుంచి బయటకు వచ్చాం. ఇద్దరు దుండగులు నేరుగా మాపై దాడికి దిగారు. కస్టోడియన్‌గా ఉన్న నాతో పాటు నా సహచరుడి పైనా కాల్పులకు పాల్పడ్డారు. నేను తొలుత తప్పించుకున్నా.... వెంకటేష్‌పై కాల్పులు జరుపుతుండటంతో తుపాకీ చేతిలో ఉన్న వ్యక్తిని చూసి అరుస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశా. దీంతో అతడు నా వైపు గురిపెట్టి కాలి్చన తూటా నా ఛాతిలోకి దూసుకుపోయింది. ఇది నాకు పునర్జన్మ లాంటిది’ అని పేర్కొన్నారు.మళ్లీ తెరపైకి మనీష్ పేరు..అఫ్జల్‌గంజ్ ఫైరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సిటీ పోలీసులు బీదర్‌తో పాటు నగరంలోని కొన్ని సీసీ కెమెరాల్లో లభించిన దుండగుల ఫొటోలను సేకరించారు. వీటిని కర్ణాటక అధికారులతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులకు పంపారు. వీటిలో ఉన్న ఓ దుండగుడు తమ రాష్ట్రానికి చెందిన మోస్ట్ వాంటెడ్ మనీష్ కుషా్వహా మాదిరిగా ఉన్నాడు అంటూ బీహార్ అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో ఇతడే సూత్రధారిగా రెండు నేరాలు జరిగినట్లు భావించారు. అతడి కోసం ముమ్మరంగా గాలించడం మొదలెట్టారు. అయితే గత శుక్రవారం రాత్రి బీహార్ పోలీసులు ఆ ఫొటోలను అక్కడి నిరంజన గ్రామంలో ఉండే మనీష్ తల్లిదండ్రులకు చూపించారు. వారు వాటిని చూసి తమ కుమారుడు కాదని చెప్పడంతో ఆ విషయాన్ని నగర పోలీసులకు చెప్పారు. దీంతో అతడు సూత్రధారి కాదనే ఉద్దేశంతో పోలీసులు మరికొన్ని కోణాల్లో ముందుకు వెళ్తున్నారు. అయితే తాజాగా మహేష్ తల్లిదండ్రులు తమ కుమారుడిని రక్షించడానికి తప్పుదోవ పట్టించి ఉంటారనే అనుమానం పోలీసులకు వచ్చింది. దీనికితోడు మహేష్ ఆచూకీ సైతం లేకపోవడంతో అతడి పాత్రను పరిగణలోకి తీసుకుంటున్నారు. దీంతో మహేష్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు. -
ప్రమాదవశాత్తూ పేలిన తుపాకీ.. పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే మృతి
లూధియానా: పంజాబ్‌కు చెందిన ఆప్ నేత, లూధియానా (వెస్ట్) ఎమ్మెల్యే గుర్ప్రీత్ బస్సి గోగి(58) ప్రమాదవశాత్తూ బుల్లెట్ గాయంతో చనిపోయారు. శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఆయన తన లైసెన్స్డ్ పిస్టల్‌ను శుభ్రం చేస్తుండగా అనుకోకుండా పేలి కణత నుంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో చనిపోయారని కుటుంబసభ్యులు, ఆప్ నేతలు తెలిపారు. తీవ్రంగా గాయపడిన గుర్‌ప్రీత్‌ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారని జాయింట్ పోలీస్ కమిషనర్ జస్కరణ్ సింగ్ తేజ తెలిపారు. ఇది అనుకోకుండా జరిగిన ఘటన అని కుటుంబసభ్యులు తెలిపారన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని చెప్పారు. ఎమ్మెల్యే గుర్‌ప్రీత్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనకు కొద్ది గంటలకు ముందు గుర్ప్రీత్ బుద్ధా నల్లాలో వ్యర్థాల తొలగింపుపై స్పీకర్ కుల్తార్ సింగ్, ఎంపీ బల్బీర్ సింగ్‌పై చర్చలు జరిపారని ఆప్ నేత ఒకరు వెల్లడించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో లూధియానా(వెస్ట్)నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గుర్ప్రీత్ రెండు పర్యాయాలు ఆ సీటును గెలుచుకున్న భరత్ భూషణ్‌పై విజయం సాధించారు. అంతకుముందు, లూధియానా మున్సిపల్ కౌన్సిలర్‌గా రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు. గత నెలలో లూధియానా మున్సిపల్ ఎన్నికల్లో ఆయన భార్య సుఖ్‌చెయిన్ కౌర్ గోగి పోటీ చేసి ఓటమి చెందారు. బుద్ధా నల్లా నవీకరణ పనుల్లో జాప్యం అవుతున్నందుకు నిరసనగా గతేడాది శంకుస్థాపన ఫలకాన్ని ధ్వంసం చేసి గుర్ప్రీత్ వార్తల్లో కెక్కారు. ఎమ్మెల్యే గుర్ప్రీత్ ఆకస్మిక మృతిపై సీఎం భగవంత్ సింగ్మాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ సీఎం, బీజేపీ నేత అమరీందర్ సింగ్, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ వారియర్ తదితరులు సంతాపం తెలిపారు. Breaking: AAP MLA from Ludhiana West, Gurpreet Gogi, has died from a gunshot wound to the head. He was at his home when the incident occurred and was taken to DMC Hospital, where he was declared dead. The cause of death and further details are awaited. pic.twitter.com/7FfIafyksZ— Gagandeep Singh (@Gagan4344) January 10, 2025 -
అమెరికాలో వరుస దాడులు
వాషింగ్టన్: కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత తొలి 24 గంటల వ్యవధిలోనే అగ్రరాజ్యం అమెరికాలో మూడు భీకర దాడులు జరిగాయి. 16 మంది మరణించారు. పదులు సంఖ్యలో జనం క్షతగాత్రులుగా మారారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం న్యూ ఆర్లియన్స్‌లో జరిగిన దాడిలో 15 మంది మృతి చెందారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రేరణతో ఓ దుండగుడు జనంపైకి వాహనంపై దూసుకెళ్లాడు. తర్వాత విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని హతమార్చారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే లాస్ వెగాస్‌లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ సమీపంలో టెస్లా కారు పేలిపోయింది. ఒకరు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. తర్వాత బుధవారం రాత్రి న్యూయార్క్ నైట్‌క్లబ్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం వాటిల్లలేదు. అయితే, ఈ మూడు ఘటనలకూ పరస్పరం సంబంధం ఉందని, ఇవన్నీ ముమ్మాటికీ ఉగ్రవాద దాడులేనని ప్రజలు అను మానం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిప్రాయాలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు రెండు ఘటనలను ఉగ్రదాడి కోణంలో విచారణ సాగిస్తుండడం గమనార్హం. జబ్బార్ ట్రక్కులో ఐసిస్ జెండా న్యూ ఆర్లియన్స్‌లోని బార్బన్ వీధిలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న జనంపైకి శంషుద్దీన్ జబ్బార్ అనే వ్యక్తి వాహనంతో దూసుకొచ్చాడు. ఫోర్డ్ ఎఫ్–150 అద్దె ట్రక్కుతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తర్వాత రైఫిల్‌తో జనంపైకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 15 మంది చనిపోగా, 35 మంది గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో జబ్బార్ హతమయ్యాడు. ట్రక్కులో ఐసిస్ జెండాను గుర్తించినట్లు ఎఫ్‌బీఐ అధికారులు చెబుతున్నారు. లాస్ వెగాస్‌లో ట్రంప్ హోటల్ వద్ద టెస్లా కారును పేల్చేసిన వ్యక్తి, జబ్బార్‌కు సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వారిద్దరూ గతంలో ఒకే మిలటరీ స్థావరంలో పనిచేశారు. న్యూ ఆర్లియన్స్ దాడిని ఉగ్రవాద దాడిగానే దర్యాప్తు అధికారులు పరిగ ణిస్తున్నారు. ఎక్కువ మందిని చంపాలన్న ఉద్దేశంతోనే జబ్బార్ దాడి చేశాడని అంటున్నారు. ఐసిస్ తో అతడికి సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో ఎఫ్‌బీఐ గుర్తించినట్లు తెలుస్తోంది. రెండు వాహనాలు ఒకే యాప్ నుంచి.. న్యూ ఆర్లియన్స్ దాడికి ఉపయోగించిన ట్రక్కును, లాస్ వెగాస్ దాడిలో ఉపయోగించిన టెస్లా కారును ‘టూరో యాప్’ నుంచే అద్దెకు తీసుకున్నారు. వాహనంలో బ్యాటరీ వల్ల ఈ పేలుడు జరగలేదని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ధ్రువీకరించారు. కారులో పేలుడు పదార్థాలను అమర్చడం వల్లే అది పేలిందని అన్నారు. కారులో లోపం ఏమీ లేదని స్పష్టంచేశారు. టెస్లా కారు పేలుడు వ్యవహారాన్ని సైతం అధికారులు ఉగ్రవాద దాడి కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. కొలరాడోలోని కొలరాడో స్ప్రింగ్స్‌లో ఈ వాహనాన్ని దుండగుడు అద్దెకు తీసుకున్నాడు. అక్కడ ఆధారాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే, సదరు దుండగుడి పేరును ఇంకా బయటపెట్టలేదు. కానీ స్థానిక మీడియా కథనం ప్రకారం... మాథ్యూ లివెల్స్బర్గర్ అనే ఈ దుండగుడు కొలరాడో స్ప్రింగ్స్ కారును అద్దెకు తీసుకున్నాడు. కారులో తొలుత నెవడాకు చేరుకున్నాడు. అందులో బాణాసంచా, మోర్టార్స్, గ్యాస్ క్యాన్లు అమర్చాడు. అనంతరం లాస్ వెగాస్‌లో ట్రంప్ హోటల్ ఎదుట పేల్చేశాడు.నైట్‌క్లబ్‌లో 30 రౌండ్ల కాల్పులు మూడో ఘటన విషయానికొస్తే న్యూ యార్క్‌లో క్వీన్స్ ప్రాంతంలోని నైట్‌క్లబ్ వద్ద కాల్పులు జరిగాయి. కనీసం 12 మంది గాయపడ్డారు. క్లబ్ బయట వేచి ఉన్న జనంపైకి దాదాపు నలుగురు వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. కనీసం 30 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి దుండుగులు పరారయ్యారు. -
ప్రియురాలి తండ్రిపై ప్రేమికుడి కాల్పులు
నాగోల్: ప్రేమించిన యువతిని తనకు దూరం చేశారన్న కో పంతో అమ్మాయి తండ్రిపై ఓ యువకుడు కాల్పలకు తెగబడ్డా డు. ఈ దాడిలో అమ్మాయి తండ్రి కన్ను కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. సరూర్‌నగర్ వెంకటేశ్వర కాలనీ రోడ్డు నెంబర్ 14లోని మల్లికారాణి అపార్ట్మెంట్లో పెరిశెట్టి రేణుక ఆనంద్ (57) నివాసం ఉంటున్నారు.ఆయనకు ఇద్దరు సంతానం. చిన్న కుమార్తె పాఠశాలల్లో చదివే సమయంలో తన క్లాస్మేట్ ఆయన గోగికర్ బల్వీర్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి బల్వీర్ ఆమెను ప్రేమిస్తున్నానని వేధించేవాడు. ఆ యువతి దుండిగల్‌లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చేరటంతో బల్వీర్ కూడా అక్కడే చేరాడు. అక్కడ కొంతకాలం వారు కలిసిమెలిసి తిరిగారు. ఈ విషయం ఇంట్లో తెలిసిన యువతి తండ్రి ఆనంద్ తన కూతురిని ఇబ్బందులకు గురిచేయవద్దని బల్వీర్‌ను హెచ్చరించాడు.పగ పెంచుకొని పక్కా ప్లాన్‌తో కాల్పులుఆరు నెలల క్రితం బల్వీర్ తన స్నేహితుడు గోపికి ఫోన్ చేసి తన ప్రేమకు అడ్డు వస్తున్న ఆనంద్‌ను చంపేస్తానని బెదిరించాడు. కొద్దిరోజుల క్రితం ఆనంద్ ఇంటివద్దకే వచ్చిన బల్వీర్.. ‘నీ కూతుర్ని ప్రేమిస్తున్నాను’అని గొడవ చేసి ‘ఎన్ని రోజులున్నా నిన్ను చంపేస్తా అని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బల్వీర్ తల్లిదండ్రులను పిలిపించిన ఆనందర్.. వారి సమక్షంలో బల్వీర్‌కు కౌన్సిలింగ్ ఇచ్చి పింపించారు. ఆనంద్ తన కూతురిని ఇటీవలే అమెరికాకు పంపించాడు.దీంతో పగ పెంచుకొన్న బల్వీర్ ఆనంద్‌ను హత్య చేయాలని పథకం వేశాడు. షూటింగ్ ప్రాక్టీస్ కోసం తెచ్చుకొన్న ఎయిర్‌గన్, షార్ట్ గన్‌తో ఆదివారం మధ్యాహ్నం ఆనంద్ ఇంటికి వచ్చి ఆయనతో గొడవ పడ్డాడు. వెంటనే ఎయిర్‌గన్‌తో లీగల్ పోలీస్, లీగల్ పోలీస్ అని గట్టిగా అరుస్తూ కాల్పులు జరిపాడు. బుల్లెట్ ఆనంద్ కుడికన్నుపై తగిలి తీవ్ర గాయమైంది.వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోయిన బల్వీర్.. పక్కనే ఉన్న అంబితా శ్రీనిలయం అపార్ట్మెంట్లో ఉన్న ఆనంద్ కారును ధ్వంసం చేసి తన బైక్‌పై పారిపోయాడు. గాయపడిన ఆనంద్‌ను స్థానికులు ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానకు తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి బల్వీర్‌ను అరెస్టు చేసినట్లు సరూర్‌నగర్ సీఐ సైదిరెడ్డి తెలిపారు. నిందితుడి నుంచి ఎయిర్‌గన్, షార్ట్‌గన్ (పిస్టల్), బైక్, సెల్‌ఫోన్ స్వా«దీనం చేసుకొన్నట్లు వెల్లడించారు.