![Punjab AAP MLA Gurpreet Gogi gunshot mysterious circumstances](/styles/webp/s3/article_images/2025/01/11/Gurpreet-Gogi1.jpg.webp?itok=CTtZAfdB)
లూధియానా: పంజాబ్‌కు చెందిన ఆప్ నేత, లూధియానా (వెస్ట్) ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ బస్సి గోగి(58) ప్రమాదవశాత్తూ బుల్లెట్ గాయంతో చనిపోయారు. శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఆయన తన లైసెన్స్‌డ్ పిస్టల్‌ను శుభ్రం చేస్తుండగా అనుకోకుండా పేలి కణత నుంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో చనిపోయారని కుటుంబసభ్యులు, ఆప్ నేతలు తెలిపారు.
తీవ్రంగా గాయపడిన గుర్‌ప్రీత్‌ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారని జాయింట్ పోలీస్ కమిషనర్ జస్‌కరణ్ సింగ్ తేజ తెలిపారు. ఇది అనుకోకుండా జరిగిన ఘటన అని కుటుంబసభ్యులు తెలిపారన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని చెప్పారు. ఎమ్మెల్యే గుర్‌ప్రీత్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఘటనకు కొద్ది గంటలకు ముందు గుర్‌ప్రీత్ బుద్ధా నల్లాలో వ్యర్థాల తొలగింపుపై స్పీకర్ కుల్తార్ సింగ్, ఎంపీ బల్బీర్ సింగ్‌పై చర్చలు జరిపారని ఆప్ నేత ఒకరు వెల్లడించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో లూధియానా(వెస్ట్)నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గుర్‌ప్రీత్ రెండు పర్యాయాలు ఆ సీటును గెలుచుకున్న భరత్ భూషణ్‌పై విజయం సాధించారు. అంతకుముందు, లూధియానా మున్సిపల్ కౌన్సిలర్‌గా రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు.
గత నెలలో లూధియానా మున్సిపల్ ఎన్నికల్లో ఆయన భార్య సుఖ్‌చెయిన్ కౌర్ గోగి పోటీ చేసి ఓటమి చెందారు. బుద్ధా నల్లా నవీకరణ పనుల్లో జాప్యం అవుతున్నందుకు నిరసనగా గతేడాది శంకుస్థాపన ఫలకాన్ని ధ్వంసం చేసి గుర్‌ప్రీత్ వార్తల్లో కెక్కారు. ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ ఆకస్మిక మృతిపై సీఎం భగవంత్ సింగ్‌మాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ సీఎం, బీజేపీ నేత అమరీందర్ సింగ్, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ వారియర్ తదితరులు సంతాపం తెలిపారు.
![ఎమ్మెల్యే గురుప్రీత్ గోగిని కాల్చి చంపిన దుండగులు](https://www.sakshi.com/s3fs-public/inline-images/no_1.jpg)
Breaking: AAP MLA from Ludhiana West, Gurpreet Gogi, has died from a gunshot wound to the head. He was at his home when the incident occurred and was taken to DMC Hospital, where he was declared dead. The cause of death and further details are awaited. pic.twitter.com/7FfIafyksZ
— Gagandeep Singh (@Gagan4344) January 10, 2025
Comments
Please login to add a commentAdd a comment