పెళ్లివేడుకలో గన్‌ ఫైర్.. బాలుడి ఛాతిలోకి బుల్లెట్ | Wedding Celebration Turns Fatal In Bhopal As Celebratory Gunfire Claims Life Of 15 Year Old Boy, More Details Inside | Sakshi
Sakshi News home page

పెళ్లివేడుకలో గన్‌ ఫైర్.. బాలుడి ఛాతిలోకి బుల్లెట్

Feb 14 2026 12:53 PM | Updated on Feb 14 2026 1:39 PM

 Wedding Gunfire Kills 15 Year Old Boy

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ వివాహ వేడుక ఒక పేదవారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. పెళ్లి సందర్భంగా నిర్వహించే బారత్ ఊరేగింపులో ఒక వ్యక్తి గన్ను పేల్చారు. దురదృష్టవశాత్తు అది 15 ఏళ్ల బాలుడికి తగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.

భోపాల్‌లో గురువారం రాత్రి   పెళ్లి సందర్భంగా ఓకుటుంబ సభ్యులు వేడుక నిర్వహించారు. దీంతో బ్యాండు బాజా నిర్వహించి డ్యాన్సులు చేశారు. ఓవరాక్షన్‌తో ఆ ఊరేగింపు వేడుకలో ఆ పెళ్లికి సంబంధించిన  గుర్తుతెలియని వ్యక్తి పిస్తోలు కాల్చారు. అయితే ఆ తూటా పక్కనే ఉ‍న్న వివేక్ అనే15ఏ‍ళ్ల బాలుడి ఛాతిలోకి వెళ్లడంతో ఆ తీవ్రగాయాల పాలయ్యాడు.

అయితే వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం పక్కనే ఉన్న బుందేల్‌ ఖండ్ మెడికల్ కాలేజ్‌కి మెరుగైన చికిత్స కోసం తీసుకెళ్లారు. ఆ యువకుడిని పరిక్షీంచిన డాక్టర్లు అప్పటికే వివేక్ మృతి చెందినట్లు తెలిపారు. అయితే వారి ఇంటిలో ఆ యువకుడు ఒక్కడే ఉద్యోగం చేస్తున్నారని ఇప్పుడు అతని మరణంతో ఆ కుటుంబానికి దిక్కులేకుండా పోయిందని వివేక్ తరపు బంధువులు రోధిస్తున్నారు.

యువకుడి మరణ వార్త విని ఆసుపత్రి ఎదుటకు పెద్దఎత్తున బాధితుడి బంధువులు చేరుకున్నారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఒకరిని అదుపులోకి తీసుకున్నామని మరోకరి కోసం గాలింపులు చేపడుతున్నామని తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందనే ఘటనపై సీసీకెమెరాలతో పాటు డ్రోన్‌ చిత్రాలు పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.               

Advertisement
 
Advertisement
Advertisement