బంగ్లా దాడులు.. USAలో నిరసనలు | Protests Across US Over Attacks of Minorities In Bangla | Sakshi
Sakshi News home page

బంగ్లా దాడులు.. USAలో నిరసనలు

Feb 3 2026 4:08 AM | Updated on Feb 3 2026 4:09 AM

Protests Across US Over Attacks of Minorities In Bangla

బంగ్లాదేశ్‌లో ఇటీవల హిందువులపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దాడులకు నిరసనగా యుఎస్‌లో భారీఎత్తున ఆందోళనలు చేపట్టారు. అమెరికాలోని ప్రధాన నగరాలలో శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. హిందువులపై హింస ఆపాలని ప్లకార్డులు చేతపట్టుకొని ర్యాలీలు నిర్వహించారు.

బంగ్లాదేశ్‌లో గత కొంతకాలంగా హిందువులపై తీవ్రస్థాయిలో దాడులు జరుగుతున్నాయి. అక్కడి మతఛాందస వాదులు రెచ్చిపోయి అక్కడి మైనార్టీలపై ప్రధానంగా హిందువులపై దాడులు చేసి చంపుతున్నారు. అయితే ఈ దాడులు పట్ల ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇంగ్లాండ్‌ పార్లమెంటులో సైతం హిందువులపై దాడులని తీవ్రంగా ఖండించారు. తాజాగా అమెరికాలో బంగ్లాదేశ్‌లో మైనారీటీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు.

బంగ్లాలో హిందువులపై జరుగుతున్న హింసను తెలియజేయడానికి ఈ ప్రదర్శన జరుపుతున్నట్లు నిర్వాహాకులు తెలిపారు. యుఎస్‌ఏ వ్యాప్తంగా దాదాపు 22 నగరాల్లో ఈ నిరసన ప్రదర్శనలు నిర్వహించినట్లు తెలిపారు. అంతర్జాతీయ సంస్థలు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఇతర దేశాలలో మైనార్టీ వర్గాల మతస్వేచ్ఛను కాపాడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్‌లో ఇటీవల తరచుగా మతహింస జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఎవరికి ఏటువంచి ఇబ్బందులు తలెత్తకుండా శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేపట్టామని అన్ని సమాజాలను తగిన విధంగా గౌరవించాలని అందరికి తగిన ప్రాధాన్యాత ఇవ్వాలని తాము కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement