అమెరికాలో ప్రభుత్వం షట్‌డౌన్ అయ్యింది. దీంతో అక్కడి ప్రభుత్వ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. 2026 బడ్జెట్‌కు సంబంధించిన గడువు అర్థరాత్రితో ముగిసింది. దానికి మద‍్ధతు లభించకపోవడంతో తాత్కాలికంగా ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి. ఇటీవల అమెరికాలో ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు పౌరులపై కాల్పులు జరపడంతో ఆదేశంలో ప్రభుత్వం పట్ల తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి.
ట్రంప్ ప్రభుత్వంపై యుఎస్‌లో వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆ దేశంలోని పౌరులు అక్కడి పాలనకు వ్యతిరేకంగా పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు. ఇటీవల ఆ దేశంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు తీరుపై అక్కడి డెమెక్రాట్లు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బిల్లులకు మద్దతివ్వమని తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా అక్కడి ప్రభుత్వం షట్‌డౌన్ అయ్యింది.
మాదక ద్రవ్యాల స్మగ్లర్లు, పిల్లలను నిర్బందించే వారు, మానవ అక్రమ రవాణాదారులను అరెస్టు చేయాడానికి బదులుగా యుఎస్ ప్రభుత్వం శాంతియుత నిరసన కారులపై దాడులు చేస్తోందని తెలిపారు. శాంతియుత నిరసనకారులను లక్షంగా చేసుకొని యూఎస్ దాడులకు తెగబడుతుందని సెనెట్ డెమెక్రాటిక్ మైనారిటీ విప్ డర్బిన్ పేర్కొన్నారు. అంతేకాకుండా చట్టాన్ని అమలు చేసే అధికారులకు సరిహద్దు భద్రతా దళాలకు యుఎస్ ప్రజలు మద్ధతు ఇస్తారు కానీ వీధుల్లో భయభ్రాంతులకు గురిచేసే అధికారులకు వారు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వబోరని తెలిపారు.
అయితే ఇదివరకే ట్రంప్ విధానాలను సంస్కరించాలని లేకపోతే నిధుల విడుదలకు అవసరమైన బిల్లులకు ఎట్టి పరిస్థితుల్లో మద్దతివ్వమని వారు హెచ్చరించారు. అయితే ఇది తాత్కాలికమేనని వచ్చేవారం ఈ నిధుల బిల్లుపై మరోసారి చర్చలు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే గతంలోనూ అమెరికాలో ఒకసారి షట్‌డౌన్ అయ్యింది.


