ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్ సెక్స్ స్కాండిల్‌కు సంబంధించి మూడు మిలియన్ల పత్రాలను అమెరికా లా డిపార్ట్‌మెంట్ విడుదల చేసింది. వీటిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్, పాప్ స్టార్ మైకేల్ జాక్సన్‌కు సంబంధించి సంచలన విషయాలు ప్రచురించింది.
అమెరికాని ఊపు ఊపేసిన ఎప్‌స్టీన్ సంబంధించి దాదాపు 3ం లక్షల పత్రాలు, 2వేల వీడియోలు అమెరికా న్యాయ విభాగం అధికారులు విడుదల చేశారు. అయితే అందులో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్, పాప్ స్టార్ మైకెల్ జాక్సన్‌ల ఫోటోలు బయిటకు వచ్చాయి. వాటితో పాటు ఈ ఫైల్స్‌లో మైక్రోసాప్ట్ ఫౌండర్ బిల్‌గ్రేట్స్ పేరు కూడా ఉంది. అంతేకాకుండా ఈ మెయిల్ లో బిల్‌గ్రేట్స్, రష్యాన్ అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకున్నారని ఆయన మెయిల్‌లో ఉన్నట్లు డైలీ మెయిల్ నివేదిక తెలిపింది.
2013 జులై 18న ఎఫ్‌స్టీన్ తనకు తానుగా ఒక సుదీర్గమైన మెయిల్ రాసుకున్నారని అందులో గేట్స్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆరు సంవత్సరాల స్నేహానికి ముగింపు పలికారని తెలిపారు. బిల్‌గేట్స్ ఈ అంశంపై గతంలోనే చింతించారు. ఎఫ్‌స్టీన్‌తో తనకు పరిచయం ఉండడంతో చాలా విచారకరమన్నారు. అయితే ఎఫ్‌స్టీన్‌తో పరిచయమే తమ విడాకులకు ప్రధాన కారణమని బిల్‌గేట్స్ మాజీ ప్రేయసి మెలిండా అన్నారు.
అయితే ప్రస్తుతం విడుదలైన ఫైల్స్‌లో బాధితుల పేర్లు, ఫోటోలు, ఎట్టిపరిస్థితుల్లో బహిర్గతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అక్కడి న్యాయశాఖ అధికారులు తెలిపారు.


