చైనాలో ఒళ్లు గొగుర్పొరిచే ఘటన చోటు చేసుకుంది. నిండా ఏడాది నిండని ఓ పసికందుకు తన తల్లి నాటు వైద్యం చేసింది. పసిపాప శరీరంతా 600కు పైగా సూదులు గుచ్చింది ఆ పసిపాపకు తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేర్చగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
చైనాలోని సౌత్ మార్నింగ్ పోస్ట్‌లో ఒళ్లు గొగుర్పొరిచే కథనం ప్రచురితమైంది. దాని ప్రకారం చైనాలోని యువాన్ ప్రావిన్సుకు చెందిన ఓ చిన్నారికి అతని తల్లి నాటువైద్యం చేస్తూ 600 సూదులు శరీరంలో గుచ్చింది. పసిపిల్లాడికి ఏదైనా జ్వరం వచ్చినా లేదా జలుబు, దగ్గు జ్వరం లాంటివి వచ్చినా తన తల్లి అతనికి సూదిద్వారా పొడిచి రక్తం తీసేది ఇది దానికి చికిత్సగా భావించేది. అయితే ఇలా చేస్తున్న క్రమంలో ఆ పకికందు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తనను ఆసుపత్రిలో చేర్చింది.
దీంతో పిల్లాడికి డాక్టర్లు చికిత్స చేయడానికి యత్నించగా ఒళ్లంతా మెడ,తల, కాళ్లు, ఇలా అనేక భాగాలపై సూది గుచ్చుకున్న గుర్తులు, నల్లటి మచ్చలు గుర్తించారు. దీంతో ఏంటా అని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అతనికి మెరుగైన చికిత్స చేసి ఆ పసికందుకు ప్రాణాపాయం లేకుండా కాపాడారు.
అయితే దర్యాప్తులో ఆ తల్లి ఏమి చదువుకోలేదని తనకు శాస్త్రీయ జ్ఞానం లేదని తేలింది. అంతే కాకుండా తన పాపను రక్షించుకోవడానికే సూదికుట్ పద్దతిని ఉపయోగించిందని తెలిసింది. అయితే ప్రస్తుతం ఆమెపై చర్యలు తీసుకువాలో లేదా అన్న విషయంపై అక్కడి అధికారులు సంకోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా చైనాలో పసిపిల్లలను హింసిస్తే కఠిన చట్టాల ప్రకారం శిక్షిస్తారు.


