మయన్నార్‌లో మాఫియా, వ్యభిచారం, ఇతర స్కామ్‌లలో పాల్గొన్న మింగ్ కుటుంబసభ్యులు 11 మందికి ప్రభుత్వం విధించిన మరణశిక్షను అమలు చేసినట్లు చైనా మీడియా పేర్కొంది. గతేడాది సెప్టెంబర్‌లో వీరికి మరణదండన విధించగా తాజాగా అమలు చేసింది.
ఉత్తర మయన్మార్‌లోని నాలుగు కుటుంబాలు అని పిలువబడే సమూహాలలో మింగ్ కుటుంబసభ్యులు అనేది ఒక సమూహం. తొలుత చైనా దేశస్థులైన వీరు చైనా సరిహాద్దుకు సమీపంలోని షాన్ రాష్ట్రంలోని స్వయం ప్రతిపత్తి గల ప్రాంతాలలో పెద్ద నేర సామ్రాజాన్ని నడిపారు. ఆన్‌లైన్ మోసాలతో పాటు హత్యలు, గ్యాంబ్లింగ్, ప్రాసిస్టూషన్, ఇలా ఎన్నో రకాల నేరాలకు పాల్పడ్డారు. ఏటా ఈ ముఠాల దోపిడీ 43 బిలియన్ డాలర్లకు పైగా ఉండేదంటే వీరు ఎంత పెద్ద స్కామ్ జరిపారో అర్థం చేసుకోవచ్చు.
2023 తర్వాత ఈ ముఠా వ్యవహారం అంతర్జాతీయంగా చర్చకు వచ్చింది. అంతే కాకుండా వీరిపై వేల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో చైనా ఈ కుటుంబంపై విచారణ చేపట్టగా ఈ కుటుంబంపై కఠిన చర్యలకు ఉపక్రమించి వీరిని అరెస్టు చేసింది. గత సెప్టెంబర్‌లో ఈ కుటుంబానికి చెందిన 11 మంది కుటుంబ సభ్యులకు ఉరిశిక్ష విధిస్తూ ఆదేశ కోర్టులు తీర్పుఇచ్చింది. తాజాగా వారికి ఉరిశిక్ష వేసినట్లు చైనా మీడియా కథనాలు ప్రచురించింది.


