breaking news
death penalty
-
చైనాలో 11 మంది కుటుంబ సభ్యులకు మరణశిక్ష.. కారణం ఇదే
మయన్నార్‌లో మాఫియా, వ్యభిచారం, ఇతర స్కామ్‌లలో పాల్గొన్న మింగ్ కుటుంబసభ్యులు 11 మందికి ప్రభుత్వం విధించిన మరణశిక్షను అమలు చేసినట్లు చైనా మీడియా పేర్కొంది. గతేడాది సెప్టెంబర్‌లో వీరికి మరణదండన విధించగా తాజాగా అమలు చేసింది.ఉత్తర మయన్మార్‌లోని నాలుగు కుటుంబాలు అని పిలువబడే సమూహాలలో మింగ్ కుటుంబసభ్యులు అనేది ఒక సమూహం. తొలుత చైనా దేశస్థులైన వీరు చైనా సరిహాద్దుకు సమీపంలోని షాన్ రాష్ట్రంలోని స్వయం ప్రతిపత్తి గల ప్రాంతాలలో పెద్ద నేర సామ్రాజాన్ని నడిపారు. ఆన్లైన్ మోసాలతో పాటు హత్యలు, గ్యాంబ్లింగ్, ప్రాసిస్టూషన్, ఇలా ఎన్నో రకాల నేరాలకు పాల్పడ్డారు. ఏటా ఈ ముఠాల దోపిడీ 43 బిలియన్ డాలర్లకు పైగా ఉండేదంటే వీరు ఎంత పెద్ద స్కామ్ జరిపారో అర్థం చేసుకోవచ్చు.2023 తర్వాత ఈ ముఠా వ్యవహారం అంతర్జాతీయంగా చర్చకు వచ్చింది. అంతే కాకుండా వీరిపై వేల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో చైనా ఈ కుటుంబంపై విచారణ చేపట్టగా ఈ కుటుంబంపై కఠిన చర్యలకు ఉపక్రమించి వీరిని అరెస్టు చేసింది. గత సెప్టెంబర్‌లో ఈ కుటుంబానికి చెందిన 11 మంది కుటుంబ సభ్యులకు ఉరిశిక్ష విధిస్తూ ఆదేశ కోర్టులు తీర్పుఇచ్చింది. తాజాగా వారికి ఉరిశిక్ష వేసినట్లు చైనా మీడియా కథనాలు ప్రచురించింది. -
రిపబ్లికన్లకు ‘ఉడుత సాయం’!
న్యూయార్క్: నేడు మొదలవుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటిదాకా ట్యాక్స్‌లు, అబార్షన్ హక్కులు, అక్రమ వలసలు ప్రధాన అంశాలుకాగా చిట్టచివర్లో ఒక ఉడుత చొరబడింది! రేబిస్ అనుమానంతో దాన్ని అధికారులు చంపేయడం చర్చనీయంగా మారింది. రిపబ్లికన్లు దీన్ని తమ ప్రచారాంశంగా మార్చుకున్నారు. బుల్లి టోపీలు, గమ్మతైన ట్రిక్కులతో మిఠాయిలపై గెంతుతూ ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన ఈ ఉడుతకు ‘పీనట్’ అని పేరు. న్యూయార్క్‌లో మార్క్ లాంగో అనే వ్యక్తి ఏడేళ్లుగా పెంచుతున్నాడు. దీంతోపాటు నక్కలా చిన్నగా ఉండే రఖూన్ అనే జీవినీ పెంచుతున్నాడు. ఈ వన్య ప్రాణుల పెంపకానికి అనుమతి, లైసెన్స్ తప్పనిసరి. అవి లేకపోవడంతో అధికారులు వాటిని స్వాదీనం చేసుకున్నారు. ఉడుత ఇటీవల ఒకరిని కరిచిందట. దాంతో ప్రాణాంతకర రేబిస్ వ్యాధి ప్రబలే ఆస్కారముందంటూ పీనట్, రఖూన్ రెండింటినీ గత వారం విషమిచ్చి చంపేశారు. దీన్ని రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ రన్నింగ్ మేట్ వాన్స్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘బైడెన్ సర్కారు నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం. ప్రభుత్వం మతిలేని, దయలేని యంత్రంగా మారింది. అనాథ ఉడుతను నిర్దయగా చంపేసింది. ఇలాంటి ఉడుతలను సైతం ట్రంప్ కాపాడగలరు’’ అంటూ మస్క్ పోస్ట్ చేశారు. ‘‘6 లక్షల మంది నేరస్తులు, 13 వేల మంది హంతకులు, 16 వేల మంది రేపిస్టులు స్వేచ్ఛగా అమెరికాలోకి అడుగు పెట్టేలా చేసిన డెమొక్రటిక్ ప్రభుత్వం ఒక పెంపుడు ఉడుతను మాత్రం బతకనీయలేదు’’ అంటూ వాన్స్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘మరణదండనే వారికి సరైన శిక్ష’
న్యూఢిల్లీ : కథువా అత్యాచార ఉదతంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని కథువా ప్రాంతానికి చెందిన అసిఫా(8)కి మాదకద్రవ్యాలు ఇచ్చి నాలుగు రోజుల పాటు పాశవికంగా అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు. బాలలపై అత్యాచారానికి పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించాలని చెప్పారు. ఈ మేరకు బాలలపై లైంగిక దాడుల నుంచి రక్షణ చట్టం(పీఓఎస్సీఓ)ను సవరించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. పిల్లలపై ఇలాంటి దారుణాలకు ఒడిగట్టేవారికి మరణ దండన విధించాలనే నిబంధనను నోట్‌గా కేబినేట్ ముందుకు తీసుకెళ్లనున్నట్లు వివరించారు. ఈ మేరకు ఓ వీడియోను మేనకా గాంధీ విడుదల చేశారు. కథువా లాంటి ఉదంతాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. 12 సంవత్సరాల లోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే మృగాళ్లకు మరణ దండనే సరైన శిక్ష అని పేర్కొన్నారు. ఈ మేరకు పోస్కో చట్టంలో సవరణలు తీసుకురావడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. -
పుణే డ్రైవర్ సంతోష్ మానేకు ఉరిశిక్ష
ముంబై:రెండేళ్ల క్రితం తొమ్మిది మంది మృతికి కారణమైన పుణే డ్రైవర్ సంతోష్ మానేకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ హైకోర్టు తీర్పు ప్రకటించింది. 2012, జనవరి 25 వ తేదీన నైట్ డ్యూటీ నుంచి డే డ్యూటీకి వచ్చిన అతను ర్యాష్ డ్రైవింగ్ కారణంగా 9 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అధికశాతం మందికి తీవ్ర గాయాలవ్వగా, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు కూడా ధ్వంసమైయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తాజాగా అతనికి ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది.


