కర్ణాటకాలో గతేడాది ఇజ్రాయెల్ మహిళతో పాటు మరోకరిపై అత్యాచారం జరిగిన ఘటనలో గంగావతి జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ ఘటనలో అరెస్టైన ముగ్గురిని నిందితులుగా గుర్తిస్తూ వారికి మరణశిక్ష విధించింది.
2025 మార్చి 6న ఒక మహిళా ఇజ్రెయెల్ పర్యాటకురాలు, ఆమె సహాయకురాలితో పాటు భారత్‌కు చెందిన ముగ్గురు ఇతర పర్యాటకులు తుంగభద్రా నది ఎడమకాలువ పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో మల్లేశ్, సాయి, శరణప్ప అనే ముగ్గురు వారి వద్ద కొచ్చి డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. వారు నిరాకరించడంతో వారిపై దాడి చేసి ముగ్గురు మగవారిని అక్కడి తుంగభద్రా లోయలో తోసివేశారు. మిగతా ఇద్దరు మహిళలపై అత్యాచారం చేశారు.
అయితే ఆ నదిలో పడ్డ ముగ్గురిలో ఇద్దరు ఈత రావడంతో బ్రతికారు. ఒడిశాకు చెందిన మరో పర్యాటకుడు దురదృష్టవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నిందితులను కఠనంగా శిక్షించాలని నిరసనలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ కేసును విచారించిన గంగావతి జిల్లా కోర్టు నిందితులకు మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసు అత్యంత అరుదైనదని దీనికి ఖచ్చితంగా కఠిన శిక్ష విధించాలని న్యాయమూర్తి తెలిపారు.


