తీవ్ర విషాదాన్ని నింపిన మెటర్నిటీ ఫోటోషూట్‌ | 3 Year Old Boy Drowns During Maternity Photoshoot In Bengaluru, Family In Shock | Sakshi
Sakshi News home page

తీవ్ర విషాదాన్ని నింపిన మెటర్నిటీ ఫోటోషూట్‌

Feb 16 2026 4:23 PM | Updated on Feb 16 2026 5:32 PM

Maternity Photoshoot tragedy 3 Year Old Boy Drowns in Bengaluru

మరో బిడ్డ రాబోతోందన్న ఆనందంలో ఉన్న  ఒక తల్లి అనూహ్యంగా తీవ్ర విషాదంలో మునిగి పోయింది. రెండోసారి తల్లి కాబోతున్నమహిళ మెటర్నిటీ ఫోటోషూట్‌ చేయించుకుంటూ ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొదటి బిడ్డ, మూడేళ్ల  చిన్నారి నీటి కొలనులో పడి  మరణించిన వైనం తీవ్ర దిగ్భ్రాంతి రేపింది.

పోలీసుల సమాచారం ప్రకారం, బెంగళూరుకు చెందిన చరణ్  స్వాతి దంపతులు. వీరికి తొలి సంతానంగా ఒక కుమారుడున్నాడు. ప్రస్తుతం  స్వాతి రెండోసారి ఎనిమిది నెలల గర్భవతి. ఈ క్రమంలో ఆమెకు మెటర్నిటీ ఫోటోషూట్ జరుగుతోంది. సమీపంలో ఆడుకుంటున్న లక్ష్మీర్‌ జారి అక్కడే ఉన్న చిన్ననీటి కొలనులో పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించి ఆ చిన్నారికి సాయం అందేలోపే  ప్రాణాలొదిలేశాడు. 

ఆసుపత్రికి తరలించేటప్పటికి చిన్నారి చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఉద్యోగం నిమిత్తం  విదేశాల్లో ఉన్న ఆ చిన్నారి తండ్రి  బెంగళూరుకు రానున్నారని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:  పాక్ నిఘా'హనీ-ట్రాప్' ముప్పు : పోలీసులకు కేంద్రం హెచ్చరిక
కస్టమర్ల రూ. 4 కోట్ల బంగారం కొట్టేసిన బ్యాంకు మేనేజర్‌

 

Advertisement
 
Advertisement
Advertisement