అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. ఏడుగురు ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేట్ జెట్ ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదినట్లు అక్కడి ఏవియేషన్ అధికారులు ప్రకటించారు. మరోకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
USA, మైనే రాష్ట్రంలోని బాంగోర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఎనిమిది మంది ప్రయాణికులతో బయిలుదేరిన ఓప్రైవేట్ జెట్‌లో టేకాప్ సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఫైలట్ జెట్‌ను అదుపుచేసే యత్నం చేసినప్పటికీ ఫలితం లేక జెట్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతిచెందగా మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ వివరాలను ఏవియేషన్ అధికారులు ప్రకటించారు.
వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పాటు విపరీతమైన మంచు కురవడమే విమాన ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. కాగా ప్రస్తుతం అమెరికాలో మంచుతుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో అక్కడికి వెళ్లే ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. భారత్ నుంచి అమెరికా వెళ్లే పలు విమానాలు అక్కడి మంచు తుఫాన్ కారణంగా రద్దయ్యాయి.


