బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బొగ్గుధరలతో పాటు విద్యుత్ ధరలకు సంబంధించి.. అదానీపవర్ లిమిటెడ్‌తో కొనసాగుతున్న వివాదాలను పరిష్కరించడానికి బ్రిటిష్‌కు సంబంధించిన ఒక న్యాయ సంస్థను నియమించినట్లు పేర్కొంది. ఈ విషయాలను ఆ దేశం అధికారికంగా ప్రకటించింది.
విద్యుత్ ధరల విషయంలో అదానీ కంపెనీతో కలిగిన విభేదాలను పరిష్కరించడానికి లండన్‌కు చెందిన 3వీపీ అనే న్యాయసంస్థను నియమించినట్లు బంగ్లాదేశ్ పవర్ డెవలఫ్ మెంట్ బోర్టు అధికారులు తెలిపారు. ఈ సంస్థ సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిటర్ సెంటర్‌లో బంగ్లాదేశ్ తరపున వాదనలు వినిపిస్తుందని తెలిపారు. గత కొద్ది నెలలుగా బంగ్లాదేశ్ వివాదాస్పద బొగ్గు సుంకాలకు సంబంధించి ఈ సంస్థ కొద్దినెలలుగా న్యాయ సహాకారం అందిస్తుంది.
బంగ్లాదేశ్ నుంచి భారత్ నుంచి బంగ్లాదేశ్ మెుత్తం అవసరాల్లో భారత్ నుంచే దాదాపు 17శాతం వరకూ విద్యుత్ సరఫరా అవుతుంది. అందులో అధికశాతం జార్కండ్ లోని అదానీ పవర్ గొడ్డా కంపెనీ నుంచే అధికంగా వెళుతుంది. అయితే విద్యుత్, బొగ్గు ధరలకు సంబంధించి ఇరుపక్షాల మధ్య వివాదం ఏర్పడింది. విద్యుత్ సంస్థ దాదాపు $485 మిలియన్ల బకాయిలు ఉన్నట్లు అదానీ సంస్థ క్లెయిమ్ చేసింది.
ఈ నేపథ్యంలో న్యాయసలహా కోసం బంగ్లాదేశ్ న్యాయ నిపుణుల కమిటీని నియమించుకుంది. సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ 1991లో స్థాపించబడింది. ఇది ఒక ప్రధాన, స్వతంత్ర లాభాపేక్ష లేని సంస్థ. ఇది ఆసియాలో వాణిజ్య వివాదాలను పరిష్కరించడానికి అత్యంత విశ్వసనీయమైన వేదికగా గుర్తింపు పొందింది.ప్రస్తుతం భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఆదేశంలో హిందువులపై దాడులు జరుగుతున్నాయి.


