ఐక్యరాజ్య సమితి సెక్రటెరీ ఆంటోనియో గుటెరెస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాన్ని కేవలం ఒకటి లేదా రెండు శక్తులు నడపలేవన్నారు. ప్రపంచ అభివృద్ధికి అనేక దేశాల భాగస్వామ్యం చాలా కీలకమన్నారు.
UNO సెక్రటెరీ ఆంటోనియో గుటెర్రెస్ అమెరికా, చైనాలకు కౌంటరిచ్చారు. ప్రపంచాన్ని ఒకటి, లేదా రెండు దేశాలు నడపడం సాధ్యం కాదన్నారు. ఆయన మాట్లాడుతూ " ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా అత్యంత శక్తివంతమైన దేశంగా ఉందనేది కాదనలేని సత్యం. అయితే భవిష్యత్తు గురించి మా అభిప్రాయంతో పాటు ఇతర దేశాల అభిప్రాయం ఏమిటంటే ఒకటి యుఎస్ కేంద్రంగా రెండు చైనా కేంద్రంగా ఉంటాయని అంచనా అయితే స్థిరమైన, శాంతి, అభివృద్ధితో కూడిన ప్రపంచం కావాలంటే అలా జరగకూడదు" అని ఆయన అన్నారు.
ప్రపంచాన్ని పరిపాలించే ఒకటి లేదా రెండు శక్తుల ద్వారా సమస్యలు పరిష్కరించబడవు అని గుటెరెస్ తెలిపారు. ఇటీవల భారత్ - ఈయూ మధ్య జరిగిన ఒప్పందం బహుళ ధృవవ్యవస్థకు ఎంతో ప్రధానమన్నారు. ప్రపంచ అభివృద్ధి అనేక దేశాల చేతిలో ఉంటేనే ఇది సాధ్యమవుతుందని తెలిపారు. అయితే ఇటీవల యూరప్ భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్యం "మదర్ ఆఫ్ ఆల్ డీల్స్" అనే కీలక ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే


