బనారస్ హిందూవిశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ మంగళ కపూర్‌కి పద్మశ్రీ అవార్డు లభించింది. మంగళ కపూర్ తన సంగీత కృషికి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.'కాశీ లత'గా ప్రసిద్ధి చెందిన మంగళకపూర్ భారతదేశంలో తొలి యాసిడ్ దాడి బాధితురాలు. 12 ఏళ్ల వయసులోనే యాసిడి దాడికి గురైన బాధితురాలు. ఆమె దేశవ్యాప్తంగా స్ఫూర్తిదాయక సంగీత విద్వాంసురాలిగా, ప్రొఫెసర్‌గా ఎలా ఎదిగిగారు. దేశంలో అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశీ అవార్డు సాధన వెనుక ఆమె చేసిన కృషి ఏంటి? తెలుసుకుందాం.
ఇక బతకలేమోమో ప్రయాణం ముగిసిపోయిందన్న తీవ్రమైన కష్టాలనుంచి బతికి బట్టకట్టడమే కాదు, అత్యంత ఉన్నతంగా ఎదిగిన ధీర ఆమె. బలమైన మనోధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ అడ్డంకీ అడ్డుకోలేదు అనడానికి ప్రొఫెసర్ మంగళ జీవితం మనకు బోధిస్తుంది. ఆమె పోరాటం,విజయ గాథ స్ఫూర్తిదాయకం. అంతేనా సంగీతం , విద్య ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురాగలమని కూడా గుర్తు చేసిన ఘనత ఆమె సొంతం.
ఉత్తరప్రదేశ్‌లోకి వారణాసికి చెందిన ఆమెపై 1965లో యాసిడ్ దాడి జరిగింది. బట్టల వ్యాపారంలో ఉన్న అసూయ కారణంగా కొంతమంది ప్రత్యర్థులు రాత్రి 2 గంటల సమయంలో దాడి చేశారు. యాసిడ్ అంటే ఏంటో కూడా తెలియని 12 ఏళ్ల వయసులో ఆమె నరకం అనుభవించింది. ఆరేళ్లపాటు ఆసత్పికే పరిమితం అయింది. ఒకటీ రెండు కాదు ఏకంగా 37 ఆపరేషన్లు .అందమైన మొహం అందవికారమైంది. మరోవైపు సమాజం సూటిపోటీ మాటలు. దీంతోచదువు కొనసాగించ లేకపోయింది. సంగీతం ఉన్న మక్కువతో ఇంట్లోనే ఉండి సంగీతం నేర్చుకుంది.

సూసైడ్ చేసుకుందామనుకుంది
బయటకు వెళ్ళినప్పుడు సూటిపోటి మాటలు వ్యంగ్య వ్యాఖ్యలు వినేదానినని మంగళ కపూర్ గతంలో చెప్పారు. పాఠశాలలో పిల్లలు ఆమెను చూసి భయపడేవారట. కొన్నిసార్లు ఆమెను ఎగతాళి కూడా చేసేవారు. 'ముక్కులేనిది' అని వెక్కిరించేవారు. దీంతో ఆమె చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుంది. కానీ జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ముందుకు సాగాలని, వెనక్కి తిరిగితే మరింత బలహీనుమవుతామని చెప్పే తండ్రి గుర్తుకు వచ్చేవారట దీంతో మరింత ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయడం అలవాటుగా మారిపోయింది. అలా దూరవిద్యలో పీజీ, తర్వాత మెరిట్ స్కాలర్ షిప్‌తో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం సంగీతం, కళల విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. అక్కడే శాస్త్రీయ సంగీత న ప్రొఫెసర్‌గా నియమితుల య్యారు.

సంగీత కచేరీలను ప్రారంభించారు. మంగళ స్వరమాధుర్యానికి అందరూ ముగ్ధులయ్యేవారు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చేవారు. దేశంలో ఆమె కార్యక్రమాలు నిర్వహించని మూల లేదు అంటే అతిశయోక్తి కాదు. సంగీత ప్రపంచంలో ఆమె గాత్రం ఎంతో ఆదరణ పొందింది. అటు టీచర్‌గా అనేకమంది విద్యార్థులకు సంగీత జ్ఞానాన్ని అందించారు. అందుకే ఆమెను "కాశీ లతా మంగేష్కర్" అని కూడా పిలుస్తారు. ఆమె కృషికి, అంకిత భావానికి అనేక అవార్డులు వచ్చి వరించాయి. తరంగ్ ఫౌండేషన్ ఆమెకు "కాశీ లత" బిరుదును ప్రదానం చేయగా, రాజ్యసభ ఆమెకు "రోల్ మోడల్" అవార్డును ప్రదానం చేసింది. తాజాగా భారతీయ శాస్త్రీయ సంగీతానికి ఆమె చేసిన సేవకు ,స్ఫూర్తిదాయకమైన పోరాట ప్రస్థానానికి గాను, కళారంగంలో 2026 ఏడాదికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించడం విశేషం.
మంగళ కపూర్ సంగీత విద్వాంసురాలు మాత్రమే కాదు, సామాజిక సేవలో కూడా చురుకుగా పాల్గొంటారు. ఆమె ఉచితంగా సంగీతం నేర్పుతుంది, సమాజంలోని వెనుకబడిన వర్గాల పిల్లల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకు రావడానికి కృషి చేస్తుంది. 2018లో 'సీరత్' పేరుతో పుస్తకాన్ని ప్రచురించారు. ఇది మరాఠీలో "మంగళ" మూవీగా జనవరి 17, 2025న విడుదలైంది. ఈ చిత్రం ఆమె పోరాటాలు , విజయాలను వివరిస్తుంది.


