అరుదైన ఈ రైల్వే స్టేషన్‌ గురించి తెలుసా? | Do You Know The railway station where trains stop midway Of Station | Sakshi
Sakshi News home page

అరుదైన ఈ రైల్వే స్టేషన్‌ గురించి తెలుసా?

Mar 10 2026 2:21 PM | Updated on Mar 10 2026 2:24 PM

Do You Know The railway station where trains stop midway Of Station

మనకు ఇప్పుడు రైలు ప్రయాణం ఎంతో ఈజీ, అసలు రైలు ప్రయాణమంటేనే సౌఖ్యవంతమైన జర్నీగా భావిస్తాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా ప్రయాణం చేయొచ్చనేది మనకు తెలిసిన విషయం. అయితే రైలు.. నది ఒడ్డున ఆగితే పరిస్థితి ఏమిటి.. ప్రయాణికులు ఎలా దిగి గమ్యస్థానాలకు వెళతారు?, ఈ తరహా పరిస్థితులు కూడా ఉంటాయా?, అంటే ఉన్నాయి అనక తప్పదు. 

పూర్వకాలంలో నది ఒడ్డున ఆగే రైలు.. ఆపై పడవల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరే సంఘటనలు కూడా ఉన్నాయట. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో ఘాజీపూర్‌లో తారీ ఘాట్ రైల్వే స్టేషన్  ఇందుకు నిదర్శనం. గంగా నదిపై ప్రయాణించే రైలు తారీ ఘాట్‌ రైల్వే స్టేషన్‌లో నది ఒడ్డు వరకే ట్రాక్‌ ఉంటుంది. దాంతో ప్రయాణికులు ఒడ్డున దిగి పడవల్లో వారి స్థానాలకు వెళ్లేవారు.  ఇది కాస్త  ఇబ్బందిగా అనిపించినా 

ఇక్కడ రైలు ట్రాక్ నది ఒడ్డునే ముగుస్తుంది, ఈ స్టేషన్ బ్రిటిష్ కాలంలో నిర్మించబడింది. అప్పట్లో గంగపై పెద్ద రైల్వే బ్రిడ్జ్ లేకపోవడంతో, రైలు మార్గం ఇక్కడే ఆగిపోయేది. ప్రయాణికులు రైలు దిగిన తర్వాత పడవల ద్వారా గంగాను దాటి తమ ప్రయాణాన్ని కొనసాగించాల్సి వచ్చేది. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు గంగానదిపై గంగానదిపై రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. తారీ ఘాట్ స్టేషన్ ప్రాముఖ్యత తగ్గిపోయింది, కానీ ఇది చారిత్రక గుర్తుగా నిలిచింది. భారత రైల్వే చరిత్రలో అరుదైన ఉదాహరణగా నిలిచిపోతోంది.

గతంలో స్టేషన్ ఎంత ఉత్సాహంగా ఉండేదో ఇక్కడ అనుభవాలను ఎదుర్కొన్న వారిని పలకరిస్తే అర్థమవుతుంది. తారీ ఘాట్ వైభవం, టీ దుకాణాలు, పడవల కోసం వేచి ఉండటం ఇవన్నీ తలుచుకుంటే తమ కళ్లలో మెరుపులు తీసుకొస్తాయని ఓ వృద్ధుడు స్పష్టం చేశాడు. 

Advertisement
 
Advertisement
Advertisement