గ్యాస్‌ కొరత.. మూత పడుతున్న హోటళ్లు.. | Commercial LPG cylinder Shortage in india | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ కొరత.. మూత పడుతున్న హోటళ్లు..

Mar 10 2026 2:09 PM | Updated on Mar 10 2026 2:15 PM

Commercial LPG cylinder Shortage in india

ఢిల్లీ:ముంబైలో ఎల్పీజీ సిలిండర్‌ కొరత తీవ్రంగా పెరిగి హోటల్‌ రంగాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే సుమారు 20 శాతం హోటళ్లు మూతపడగా, త్వరలో మరో 50 శాతం హోటళ్లు మూసివేయాల్సి వస్తుందని హోటల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ముంబై (AHAR) హెచ్చరించింది.

ఎల్పీజీ సిలిండర్ల కొరత కారణంగా హోటళ్లలో వంటకాలు తయారు చేయడం అసాధ్యమవుతోంది. ప్రతిరోజూ వేలాది మంది కస్టమర్లు హోటళ్లపై ఆధారపడుతుంటారు. సరఫరా సమస్యలు కొనసాగితే, ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని హోటల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ముంబై అధ్యక్షుడు హెచ్చరించారు.ఈ సందర్భంగా ప్రభుత్వం, ఆయిల్‌ కంపెనీలను తక్షణం చర్యలు తీసుకోవాలని హోటల్‌ అసోసియేషన్‌  కోరింది.

ఎల్పీజీ సరఫరా పెంచాలి. హోటళ్లకు ప్రత్యేక కోటా కేటాయించాలి. బ్లాక్ మార్కెటింగ్‌ అరికట్టాలి. ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే, ముంబైలో హోటల్‌ రంగం పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. హోటల్‌ రంగం ముంబై ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. లక్షలాది మంది ఉద్యోగులు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. హోటళ్లు మూతపడితే, ఉద్యోగాలు కోల్పోవడం, పర్యాటక రంగం దెబ్బతినడం, ఆర్థిక నష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement