‘నన్ను కాపాడండి’ అంటూ భర్తకు ఫోన్‌..! | Wife And Husband Incident | Sakshi
Sakshi News home page

‘నన్ను కాపాడండి’ అంటూ భర్తకు ఫోన్‌..!

Mar 10 2026 2:10 PM | Updated on Mar 10 2026 2:15 PM

Wife And Husband Incident

ఒడిషా: మల్కన్‌గిరి జిల్లా బలిమెల పట్టణంలో పరిజాగూఢ వీధిలో నివనిస్తున్న మిలాన్‌ మిస్త్రీ భార్య లిల్లీ మిస్త్రీ ఫిబ్రవరి 28 నుంచి కనిపించడం లేదు. దీంతో ఆయన బలిమెల పోలీసు స్టేషన్‌లో మార్చి 2వ తేదీన ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఎస్పీ వినోద్‌ పటేల్‌ ఆదేశాలతో దర్యాప్తు ప్రారంభించారు. 

ఈ విషయం మీడియాలో రావడంతో అఖిల భారత హిందూ మహసభ జిల్లా అధ్యక్షుడు పిడియా పోడియామి పోలీసులతో సంప్రదింపులు జరిపారు. లిల్లీ తన భర్తకు 4వ తేదీన ఫోన్‌ చేసి ‘నన్ను రక్షించండి లేక పోతే వీరు నన్ను అమ్మేస్తున్నారు’ అని చెప్పింది. వెంటనే ఆ విషయాన్ని ఆయన పోలీసులకు, అఖిల భారత్‌ సభ్యులకు తెలియజేశారు. 

పడియా పోడియమి వెంటనే అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్ర సంస్థాగత మంత్రి విశ్వజిత్‌ ముదిలికు సమాచారం ఇవ్వగా.. ఆయన స్పందించి అక్కడి పోలీసులతో చర్చించి మొబైల్‌ నంబర్‌ను ట్రాక్‌ చేశారు. ఆమె బేతూల్‌ జిల్లా చోపనాయక్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని బెంగాలీ బస్తీ ప్రాంతంలో ఒక వృద్ధురాలి ఇంటిలో ఉన్నట్లు తెలిసి 7వ తేదీన లిల్లీను అలానే మరో యువతిని ఆ వృద్ధురాలి ఇంటి నుంచి రక్షించారు. మల్కన్‌గిరి ఎస్పీ వెంటనే బలిమెల ఎస్‌ఐ మనోహర్‌ సాహుతో ఓ బృందాన్ని పంపించి వారిని సోమవారం మల్కన్‌గిరి తీసుకువచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement