అర్థరాత్రి.. అమాంతంగా పెరిగిన పెట్రోల్‌,డీజిల్‌ ధరలు | Sri Lanka CPC Hikes Petrol, Diesel And Kerosene Prices Amid Soaring Global Oil Rates, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

Sri Lanka : అర్థరాత్రి.. అమాంతంగా పెరిగిన పెట్రోల్‌,డీజిల్‌ ధరలు

Mar 10 2026 9:53 AM | Updated on Mar 10 2026 10:30 AM

Fuel prices increased in Sri Lanka

కొలంబియా: శ్రీలంక ప్రజలకు ప్రభుత్వ రంగ చమురు సంస్థ సియాలోన్ పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీ) అర్థరాత్రి పెద్ద షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ధరలు మార్చి 9 అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.

సీపీసీ లెక్కల ప్రకారం.. ప్రపంచ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు గత వారం 92–93 అమెరికన్ డాలర్ల వద్ద ఉండగా, కొన్ని రోజుల్లోనే 115 డాలర్లకు చేరాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, సరఫరా అంతరాయం వంటి అంశాలు ఈ పెరుగుదలకు కారణమయ్యాయి. ఈ పరిస్థితులు శ్రీలంకలో ఇంధన ధరలపై తక్షణ ప్రభావం చూపాయి.

ఆక్టేన్ 92 అంటే పెట్రోల్‌లోని ఆక్టేన్ రేటింగ్ (Octane Rating) ను సూచిస్తుంది. ఇది ఇంధనం ఇంజిన్‌లో నాకింగ్ (knocking) లేకుండా ఎంత వరకు కంప్రెషన్‌ను తట్టుకోగలదో చూపించే ప్రమాణం. ఆక్టేన్ 92 అంటే ఇంధనం 92 స్థాయి కంప్రెషన్‌ను తట్టుకోగలదని అర్థం. వాటి ఆధారంగా

ఆక్టేన్ 92 -పెట్రోల్ లీటరుకు రూ.317
ఆక్టేన్ 95- పెట్రోల్ రూ.365
సాధారణ డీజిల్- రూ.303
హై-పర్ఫార్మెన్స్ వాహనాలకు వినియోగించే డీజిల్- రూ.353
కిరోసిన్ -రూ.195
ప్రతి లీటరుకు సగటున రూ.22–25 వరకు పెరిగినట్లు తెలుస్తోంది.

ఈ పరిణామం శ్రీలంక ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారింది. ఇంధన ధరల పెరుగుదల వల్ల రవాణా, ఉత్పత్తి, వినియోగదారుల ఖర్చులు అన్నీ ప్రభావితమవుతాయి. ప్రభుత్వం తక్షణ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో అకస్మాత్తుగా వచ్చే ఇబ్బందులను తగ్గించవచ్చు. దీర్ఘకాలికంగా, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, శక్తి సామర్థ్య విధానాలు అమలు చేయడం ద్వారా స్థిరమైన పరిష్కారం సాధ్యమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement