ప్రియుడికి వివాహమైందని తెలిసి..  ఏం చేసిందంటే..? | Woman cut off her lover private parts | Sakshi
Sakshi News home page

ప్రియుడికి వివాహమైందని తెలిసి..  ఏం చేసిందంటే..?

Mar 2 2026 1:14 AM | Updated on Mar 2 2026 1:14 AM

Woman cut off her lover private parts

న్యూఢిల్లీ: ఓ యువతి తనతో రెండేళ్లుగా సంబంధం నెరపుతున్న యువకుడికి అప్పటికే పెళ్లయిందని తెలుసుకుని కక్షతో రగిలిపోయింది. నమ్మకంగా పిలిపించుకుని, మత్తు మందిచ్చి, అతడి మర్మావయవాలను కోసేసింది. తీవ్ర గాయాలతో అతడు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఫిబ్రవరి 25వ తేదీన ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు(22) హిందూరావ్‌ ఆస్పత్రిలో తీవ్ర గాయాలతో చేరాడు. ఆస్పత్రి అధికారుల సమాచారంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాధితుడిని యూపీలోని రాంపూర్‌కు చెందిన ఆర్‌ఎంపీగా పనిచేసే విసర్జీత్‌గా గుర్తించారు. 

ఇతడికి రెండేళ్ల క్రితం ఢిల్లీలోని వజీరాబాద్‌కు చెందిన అమీనా ఖాతూన్‌తో పరిచయమేర్పడింది. ఫిబ్ర వరి 24వ తేదీన అమీనా వద్దకు విసర్జీత్‌ వచ్చాడు. ఆ రోజు రాత్రి అతడికి అమీనా మత్తు పదార్థం కలిపిన పాలను తాగించింది. మత్తులోకి జారుకున్నాక అతడి మర్మాయవాలను పదునైన ఆయుధంతో కోసేసింది. అప్పటికే పెళ్లయినా కాలేదని విసర్జీత్‌ చెప్పడంతో ఆగ్రహంతోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. తెల్లారాక విసర్జీత్‌ గాయాలతో దగ్గర్లోని హిందూరావ్‌ ఆస్పత్రిలో చేరాడు. వివిధ సెక్షన్ల కింద అమీనాపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న ఆమె కోసం గాలిస్తున్నారు. అమీనా స్వస్థలం బిహార్‌లోని కటిహార్‌ ప్రాంతం.

Advertisement
 
Advertisement
Advertisement