private parts cut off
-
ప్రియుడికి వివాహమైందని తెలిసి.. ఏం చేసిందంటే..?
న్యూఢిల్లీ: ఓ యువతి తనతో రెండేళ్లుగా సంబంధం నెరపుతున్న యువకుడికి అప్పటికే పెళ్లయిందని తెలుసుకుని కక్షతో రగిలిపోయింది. నమ్మకంగా పిలిపించుకుని, మత్తు మందిచ్చి, అతడి మర్మావయవాలను కోసేసింది. తీవ్ర గాయాలతో అతడు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఫిబ్రవరి 25వ తేదీన ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు(22) హిందూరావ్ ఆస్పత్రిలో తీవ్ర గాయాలతో చేరాడు. ఆస్పత్రి అధికారుల సమాచారంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాధితుడిని యూపీలోని రాంపూర్‌కు చెందిన ఆర్ఎంపీగా పనిచేసే విసర్జీత్గా గుర్తించారు. ఇతడికి రెండేళ్ల క్రితం ఢిల్లీలోని వజీరాబాద్‌కు చెందిన అమీనా ఖాతూన్‌తో పరిచయమేర్పడింది. ఫిబ్ర వరి 24వ తేదీన అమీనా వద్దకు విసర్జీత్ వచ్చాడు. ఆ రోజు రాత్రి అతడికి అమీనా మత్తు పదార్థం కలిపిన పాలను తాగించింది. మత్తులోకి జారుకున్నాక అతడి మర్మాయవాలను పదునైన ఆయుధంతో కోసేసింది. అప్పటికే పెళ్లయినా కాలేదని విసర్జీత్ చెప్పడంతో ఆగ్రహంతోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. తెల్లారాక విసర్జీత్ గాయాలతో దగ్గర్లోని హిందూరావ్ ఆస్పత్రిలో చేరాడు. వివిధ సెక్షన్ల కింద అమీనాపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న ఆమె కోసం గాలిస్తున్నారు. అమీనా స్వస్థలం బిహార్‌లోని కటిహార్ ప్రాంతం. -
ప్రియుడిని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి పిల్చి, ప్రైవేట్ పార్ట్స్‌పై దాడి
పెళ్లికి నిరాకరించిన ప్రేమికుడిపై దాడిచేసి ప్రైవేట్ భాగాలను నరికివేసింది.తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో ఇద్దరూ వివాహితులే. ముంబైలో ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్డీటీవీ కథనం ప్రకారం 25 ఏళ్ల ఒక మహిళ ఇద్దరు పిల్లల తల్లి. ఈమెకు 42 ఏళ్ల వివాహితుడితో దాదాపు ఏడు సంవత్సరాలుగా వివాహేతర సంబంధం ఉంది. భార్యకు విడాకులిచ్చి తనన పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోంది. దీంతో అసలు పెళ్లి ఊసు ఎత్తగానే సరైన సమాధానం చెప్పకుండా ముఖం చాటేసేవాడు. తన మాట వినడం లేదని, భార్యను విడిచిపెట్టడానికి నిరాకరించాడన్న కోపంతో ఆ మహిళ ఇంత దారుణానికి ఒడిగట్టింది.పెళ్లి చేసుకోవాలన్న ఒత్తిడి తీవ్రమవుతున్న నేపథ్యంలో గత ఏడాది నవంబరులో బిహార్‌కు వెళ్లి పోయాడు. భార్యాబిడ్డలు ముంబైలోని శాంటా క్రజ్‌లోని ఇంట్లో ఉంటున్నారు. గత 18 ఏళ్లుగా కుటుంబంతో కలిసి ఇక్కడే ఉంటున్నాడు. బాధితుడు. బిహార్‌కు వెళ్లిన తరువాత కూడా ఆమె ఫోన్ కాల్స్ ద్వారా పెళ్లి గురించి అడగడం, అతన్ని బెదిరించడం జరుగుతూనే ఉంది. అయితే 2026 కొత్త సంవత్సరం సందర్బంగా డిసెంబర్ 19న ముంబైకి తిరిగొచ్చాడు. ఇదే అదనుగా భావించిన ప్రేమికురాలు నూతన సంవత్సర వేడుకలకు ఇంటికి రావాల్సిందిగా బాధితుడిని ఆహ్వానించింది. గురువారం తెల్లవారుజామున మాటల్లో పెట్టి, సమయం చూసి పదునైన ఆయుధంతో అతని ప్రైవేట్ భాగాలపై దాడిచేసిందని ముంబై పోలీసు అధికారి తెలిపారు.ఇదీ చదవండి: ఐదు నెలల చిన్నారి ఉసురు తీసిన ‘పాలు’తీవ్ర గాయాలపాలై అధిక రక్తస్రావంతో బాధితుడు మొత్తం మీద బైటపడి, సోదరుడు, ఇతర బంధువుల సాయంతో బీఎన్ దేశాయ్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. గాయం చాలా లోతుగా ఉందని శస్త్రచికిత్స అవసరం కావచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఇద్దరికీ బంధుత్వం ఉన్నట్టు తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితురాలి కోసం వెతుకుతున్నారు. ఇదీ చదవండి: ఐఐటీ హైదరాబాద్ విద్యార్థికి ఏకంగా రూ. 2.5 కోట్ల ఆఫర్, రికార్డ్ -
వింత చర్యకు పాల్పడిన మతగురువు
జైపూర్ : రాజస్థాన్‌లోని ఓ మతగురువు వింత చర్యకు పాల్పడ్డారు. సేవాగిరిదామ్కు చెందిన 40 ఏళ్ల మత గురువు మహంత్ అనిల్ పురోహిత్ తన జననాంగాన్ని కోసేసుకున్నారు. మత గురువు అనిల్ శుక్రవారం అర్ధరాత్రి తన గదిలోనే ఈ చర్యకు పాల్పడ్డారు. ఇటీవలి కాలంలో బాబాలు, స్వామిజీలపై తీవ్రమైన ఆరోపణలు వస్తుండటంతో మనస్తాపానికి గురైన ఆయన ఈ విధంగా చేసినట్టు తెలుస్తోంది. తన క్యారెక్టర్‌ను నిరూపించుకోవడానికే అతను ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం. గాయపడ్డ అనిల్‌ను ఆయన అనుచరులు తొలుత స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. జైపూర్ తరలించాల్సిందిగా వైద్యులు సూచించారు. అనిల్ ప్రస్తుతం జైపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి అనిల్ నుంచి వివరాలు సేరిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఇద్దరివి కోసేసిన హిజ్రా
ఉత్తరప్రదేశ్‌లోని మీటర్ నగరంలో ఓ హిజ్రా.. ఇద్దరు యువకుల అంగాలను కోసిపారేసింది. ఓ పౌల్ట్రీ ఫాం వద్ద ఆ యువకులిద్దరూ స్పృహలేని పరిస్థితిలో పడి ఉండగా అటుగా వెళ్తున్నవారు గమనించి పోలీసులకు తెలిపారు. దాంతో ఈ విషయం బయటపడింది. వారిని పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆ యువకులను సివల్ఖాస్ ప్రాంతానికి చెందిన సబీర్, జాని ప్రాంతానికి చెందిన ప్రదీప్‌గా గుర్తించారు. రైల్వేరోడ్డు వద్ద తమకు నీలమ్ అనే హిజ్రా టీ ఇచ్చిందని, అది తాగిన తర్వాత తాము స్పృహ కోల్పోయామని సబీర్ చెప్పాడు. నీలమ్ బృందంలో సబీర్ డోలు వాయించేవాడు, ప్రదీప్ వంటవాడిగా పనిచేసేవాడని పోలీసులు చెప్పారు. నిందితుల కోసం గాలింపు జరుపుతున్నామన్నారు.


