14 ఏళ్ల ఐటీ జాబ్‌ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయం | BTech graduate left IT after 14 years Now earns Rs 10 lakh a month as a farmer | Sakshi
Sakshi News home page

14 ఏళ్ల ఐటీ జాబ్‌ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయం

Aug 17 2026 5:51 PM | Updated on Aug 17 2026 6:07 PM

BTech graduate left IT after 14 years Now earns Rs 10 lakh a month as a farmer

ఐటీ రంగంలో సుదీర్ఘ కరియర్‌ వదిలేసి పెద్ద సాహసమే చేశాడు. కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి సొంతూరికి వచ్చి కేవలం తన కోసమే కాకుండా, తన గ్రామస్తులకి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మొదలు పెట్టిన ప్రస్థానం  గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. కోట్లలో ఆదాయాన్ని సంపాదిస్తుండటమే కాదు 24 మంది స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఒడిశాకు చెందిన విక్రమ్‌దేవ్ మహాపాత్ర   సక్సెస్‌ స్టోరీ తెలుసుకుందాం.   

ఐటీ రంగంలో 14 ఏళ్ల కరియర్‌ను వదిలి విక్రమ్‌దేవ్ మహాపాత్ర సొంతూరైన నబరంగ్‌పూర్‌లో 'గంగా భూమి మష్రూమ్స్' పేరిట భారీ వాణిజ్య పుట్టగొడుగుల (Mushroom) ఫారమ్‌ను ప్రారంభించారు. వ్యాపారంలో మెళకువలను  అవగాహన చేసుకొని, విజయవంతంగా పుట్టగొడుగు సాగును, మార్కెటింగ్‌ను విజయవంతం నిర్వహించారు. ఇప్పుడు కోట్లలో వ్యాపారం చేస్తూ స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నారు.


'గంగా భూమి మష్రూమ్స్ సక్సెస్‌ ఎలా సాగిందంటే..
'గంగా భూమి మష్రూమ్స్', రోజుకు 500-600 కిలోల పుట్టగొడుగులను ఉత్పత్తి చేస్తోంది. అంటే నెలకు 15-18 టన్నులు. నివేదికల ప్రకారం నెలవారీ ఆదాయం రూ. 16-19 లక్షలు కాగా, ఈ వ్యాపారం స్థానికులు 24 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇందులో 18 మంది మహిళలు,  ఆరుగురు పురుషులు ఉండటం విశేషం. 

తద్వారా నెలవారీ ఆదాయం రూ. 16-19 లక్షలు (కిలో సగటున రూ. 100-110) ఆర్జిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వ్యయం సుమారు రూ. 2.56 కోట్లు. ఇందులో ప్రభుత్వ సబ్సిడీ రూ. 97 లక్షలు 'ముఖ్యమంత్రి కృషి ఉద్యోగ్ యోజన' కింద లోను తీసుకున్నారు. మొత్తంగా నిర్వహణ ఖర్చులు పోగా, ఈ వ్యాపారం నెలకు రూ. 10 లక్షలకు పైగా సంపాదిస్తున్నట్లు సమాచారం. 

 ఇదీ చదవండి: 14 మిలియన్ల ఫాలోవర్లు : కానీ యష్‌ ఫాలో అయ్యేది ఆమె ఒక్కర్నే!

బీటెక్  నుండి పుట్టగొడుగుల సాగు వరకు
విక్రమ్‌దేవ్ 2012లో ఒడిశాలోని బిజు పట్నాయక్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు.ఆ తర్వాత ఐటీలోకి ప్రవేశించి, డిస్కవర్చర్ సొల్యూషన్స్, మైండ్‌ట్రీ, సెరోల్ టెక్నాలజీస్ మరియు ఎల్‌టిఐ మైండ్‌ట్రీ లాంటి కంపెనీల్లో పనిచేశారు. అలా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, మాడ్యూల్ లీడ్, టెక్నికల్ లీడ్, ప్యాకేజీ ఇంప్లిమెంటేషన్‌లో సీనియర్ స్పెషలిస్ట్ వంటి వివిధ పాత్రలను పోషించారు. టెక్నికల్ లీడ్‌గా పనిచేసిన అనుభవం, నేర్చుకున్న ప్రాజెక్ట్ ప్లానింగ్, సిస్టమ్స్ మేనేజ్‌మెంట్ ,లాజిస్టిక్స్ నైపుణ్యాలను వ్యవసాయ రంగంలో ఉపయోగించి ఈ ఫారమ్‌ను అభివృద్ధి చేశారు. ఇక్కడ పండిన పుట్టగొడుగులను ఏడాది పొడవునా బ్రహ్మపూర్ , భువనేశ్వర్ మార్కెట్లకు నిరంతరాయంగా సరఫరా చేస్తూ ముందుకు సాగుతున్నారు. 

ఇదీ చదవండి: త్విషా శర్మ మృతి కేసులో ట్విస్ట్‌ : మాజీ జడ్జికి షాక్‌!
ఇదీ చదవండి: 24 గంటల్లో 1.6 లక్షల ఫాలోవర్స్‌ : సీజేపీ తరహాలో డీజేపీ సంచలనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement