ముంబైలో సీజేపీ నిర‌స‌న‌.. ప్ర‌ముఖ న‌టుడి మ‌ద్ద‌తు | Naseeruddin Shah joins Hands with Abhijeet Dipke in Mumbai | Sakshi
Sakshi News home page

అభిజీత్ దీప్కేను కలిసిన న‌టుడు నసీరుద్దీన్ షా

Oct 2 2026 5:12 PM | Updated on Oct 2 2026 5:51 PM

Naseeruddin Shah joins Hands with Abhijeet Dipke in Mumbai

ముంబై: ప్ర‌ఖ్యాత బాలీవుడ్ న‌టుడు నసీరుద్దీన్ షా శుక్రవారం ముంబైలోని ఆజాద్ పార్క్‌లో కాక్రోజ్‌ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను కలిశారు. నసీరుద్దీన్ షా చూడ‌గానే అభిజీత్ సంతోషం వ్య‌క్తం చేశారు. శిర‌సు వంచి ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికాడు. 'నేను మీకు పెద్ద అభిమానిని' అని చెప్పగానే.. అత‌డిని న‌సిరుద్దీన్ షా ఆత్మీయ ఆలింగ‌నం చేసుకున్నారు. 

దేశ ప్ర‌జ‌ల కోసం పోరాడుతున్న అభిజీత్‌ను అభినందించారు. 'నేనే నీకు పెద్ద అభిమానిని' అంటూ అభిజీత్‌ను మెచ్చుకున్నారు. ఈ మ‌ధుర క్ష‌ణాల‌కు సంబంధించిన వీడియోను త‌న ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు అభిజీత్ దీప్కే. కాగా, ఇంత‌కుముందు జూలైలో ఢిల్లీలో సీజేపీ చేప‌ట్టిన ఆందోళ‌న కార్య‌క్ర‌మానికి నసీరుద్దీన్ షా సంఘీభావం ప్ర‌క‌టించిన విష‌యం గుర్తుండే ఉంటుంది.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా సీజేపీ ఈరోజు శివాజీ పార్క్ గేట్ నంబ‌రు 6 వ‌ద్ద నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల‌ని, స‌ర్ ప్ర‌క్రియ‌ను త‌క్ష‌ణ‌మే నిలిపివేయాల‌ని సీజేపీ డిమాండ్ చేస్తోంది. సీజేపీ నిర‌స‌న కార్య‌క్ర‌మానికి సినిమా ప‌రిశ్ర‌మ‌కు చెందిన పలువురు ప్ర‌ముఖులు సంఘీభావం ప్ర‌క‌టించారు. ప్ర‌కాశ్‌రాజ్, కిశోర్‌, జైన్ మేరీ ఖాన్, విశాల్ దద్లానీ.. సీజేపీకి మ‌ద్ద‌తు తెలిపిన వారిలో ఉన్నారు. సీజేపీ ఆందోళ‌న నేప‌థ్యంలో శివాజీ పార్క్ వ‌ద్ద‌కు భారీగా జ‌నం చేరుకున్నారు. మ‌రోవైపు #Gogyanugo హాష్‌ట్యాగ్‌తో సోష‌ల్ మీడియాలో జ్ఞానేష్ కుమార్‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. 

ఇదీ చ‌ద‌వండి: ఢిల్లీలో హైటెన్షన్‌.. ఇంటర్నెట్ బంద్

<

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement