కొద్ది నెలల క్రితం.. మత సామరస్యానికి సంబంధించిన ఘటనతో వైరల్ అయిన దీపక్ కుమార్ గుర్తున్నాడా?. ఓ వివాదంలో హిందూ సంఘాల నుంచి ఓ ముస్లిం వ్యాపారిని రక్షించి అందరి నుంచి ప్రశంసలు అందుకున్నాడతను. ఆ సమయంలో నా పేరు ‘మహ్మద్ దీపక్’ అంటూ అతను చెప్పిన మాటలు చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా దీపక్‌ను మెచ్చుకుని.. ‘భారత హీరో’గా అభివర్ణించారు. అయితే తాజాగా అతను మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.
ఉత్తరాఖండ్‌వాసి మహ్మద్ దీపక్ (దీపక్ కుమార్).. ఓ వ్యాపారిని బెదిరించి, దాడికి పాల్పడిన కేసులో అరెస్టయ్యాడు. మొన్నీమధ్యే మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని ఓ మసీదు వ్యవహారం వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటనపై దీపక్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. దానికి సంజీవ్ టోంక్ అనే యూజర్ కామెంట్ చేశాడు. ఈ విషయంలో కోపంతో రగిలిపోయిన దీపక్.. అతని దుకాణానికి వెళ్లి దూషించి, బెదిరించారు.
The man seen in the video is Md Deepak, the “hero” of the Congress ecosystem. Rahul Gandhi and several big and small Congress leaders were desperate to meet him.
Now look at what he is doing.
He is accused of abusing and threatening a Hindu shopkeeper and even attempting to… pic.twitter.com/nNEWioLlie— Mr Sinha (@Mrsinha) October 1, 2026
ఈ మేరకు ఆ పెద్దాయన కోట్‌ద్వార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. దీపక్ సంజీవ్‌ను బెదిరించింది నిజమేనని సీసీటీటీ ఫుటేజీ ద్వారా నిర్ధారించుకున్నారు. దీపక్‌ను అరెస్ట్ చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందన్న కారణంతో కూడా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
ఈ ఏడాది జనవరిలో దీపక్ కుమార్ పేరు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. కోట్‌ద్వార్‌లో ఓ ముస్లిం దుకాణదారుడి విషయంలో వివాదం తలెత్తిన సమయంలో ఆయన జోక్యం చేసుకున్నారు. ఆ సందర్భంగా “నా పేరు మహ్మద్ దీపక్” అంటూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ఆయనను తన వద్దకు పిలిపించుకుని ప్రశంసించారు. ఇప్పుడు ఓ హిందూ వ్యాపారిని బెదిరింపు కేసులో అరెస్ట్ కావడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
करोड़ों भारतीयों के दिलों में सद्भाव और मोहब्बत की विचारधारा है, मगर मन में भय भी है - दीपक ने उन सभी को अपने साहस से राह दिखाई है।
जो लोग नफ़रत फैलाकर समाज को डराने की कोशिश करते हैं, वो दरअसल कायर होते हैं - उनसे कभी भी डरो मत।
दीपक ने हमारे तिरंगे और संविधान की रक्षा की है।… pic.twitter.com/lk3IMlk8x8— Rahul Gandhi (@RahulGandhi) February 25, 2026


