రూ.లక్షకు 5 తులాల బంగారం! | Hyderabad Woman Gold Incident | Sakshi
Sakshi News home page

రూ.లక్షకు 5 తులాల బంగారం!

Oct 3 2026 1:15 PM | Updated on Oct 3 2026 1:19 PM

Hyderabad Woman Gold Incident

బంగారం ధర ఆకాశాన్నంటుతోంది. తులం రూ.1.50 లక్ష పలుకుతోంది. ఇలాంటి సమయంలో రూ.లక్షకే ఐదు తులాల బంగారం ఇస్తానని ఓ మహిళ చెప్పడంతో పలువురు నిజమని నమ్మి మోసపోయారు. వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లుకు చెందిన శిల్ప ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని మణికొండలో నివాసం ఉంటోంది. తన భర్త దుబాయిలో ఉంటారని, అక్కడి నుంచి తక్కువ ధరకు బంగారం తెప్పించి ఇస్తానంటూ ఆమె అనంతపురం రూరల్‌ పరిధిలోని మండ్ల సుబ్బారెడ్డికాలనీకి చెందిన ముగ్గురు మహిళలను నమ్మించింది. 

అందులో ఒక మహిళ రూ.14 లక్షలు శిల్ప ఖాతాకు బదిలీ చేసింది. మిగిలిన ఇద్దరు కూడా రూ.లక్షల్లోనే చెల్లించారు. అయితే ఇప్పటివరకు ఒక్కరికి కూడా బంగారం ఇవ్వలేదు. పలుమార్లు డబ్బు లేదా బంగారం గురించి అడిగినా శిల్ప నుంచి సరైన స్పందన రాకపోవడంతో బాధితులు తాము మోసం పోయామని గ్రహించి       అనంతపురం రూరల్‌ పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని సీఐ శ్రీకాంత్‌యాదవ్‌ తెలిపారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు? ఎంత డబ్బులు వసూలు చేశారు? అనే అంశాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.   

-అనంతపురం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement