సాక్షి, తాడేపల్లి: తిరుపతి శ్రీ సిటీలో జరిగిన ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్.. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వారు త్వరగా కోలుకునేలా చర్యలు చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి, తగిన సహాయం అందించాలన్నారు.
ఇదిలా ఉండగా.. శ్రీ సిటీలో ఉన్న భారీ టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పలువురు కార్మికులు గాయపడినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు తెలియాల్సి ఉంది.


