హైదరాబాద్ : వైవిధ్యభరిత కలాలు అలరిస్తున్నాయి. ‘పెన్’టాస్టిక్‌గా సందడి చేస్తున్నాయి. (Hyderabad Pen Show)
శుక్రవారం నగరంలోని లక్డీకాపూల్ ఎఫ్‌టీసీసీఐ భవనంలో ప్రారంభమైన ‘హైదరాబాద్ పెన్ షో’ కలం ప్రియులను ఆకట్టుకుంటోంది.
పెన్ షో 3 రోజుల పాటు కొనసాగనుంది. మొదటి రోజు కలం ప్రేమికులు తరలివచ్చి నచ్చిన పెన్‌లను కొనుగోలు చేశారు.


