సాక్షి, తాడేపల్లి: భారత మహిళా హాకీ జట్టుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించటంపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. స్వర్ణ పతకం సాధించడం దేశానికే గర్వకారణమని ప్రశంసలు కురిపించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా.. ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన భారత మహిళా హాకీ జట్టుకు అభినందనలు. డిఫెండింగ్ ఛాంపియన్ చైనాను 1–0తో ఓడించి.. 44 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. స్వర్ణ పతకం సాధించడం దేశానికే గర్వకారణం. ఆద్యంతం అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించిన భారత జట్టు.. ముఖ్యంగా డిఫెన్స్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచింది. కీలక సమయంలో కెప్టెన్ సవితా పునియా పెనాల్టీ స్ట్రోక్‌ను అడ్డుకోవడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఈ విజయంతో 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌కు భారత్ నేరుగా అర్హత సాధించడం మరింత ఆనందదాయకం. దేశం గర్వించేలా చేసిన భారత క్రీడాకారిణులందరికీ అభినందనలు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పోస్టు చేశారు.
Heartiest congratulations to our Indian women’s hockey team on a historic Asian Games triumph. Defeating defending champions China 1–0 ending a 44-year wait for gold is a moment of immense pride for the country. The team’s resilience in defence, crowned by Savita Punia’s crucial… pic.twitter.com/xoox2dEHhO
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 3, 2026


