IND vs PAK: ఫైనల్లో వైభవ్‌ విఫలం.. అభిషేక్‌ రియాక్షన్‌ వైరల్‌ | IND vs PAK Final: Vaibhav Fails back to back Sixers, Abhishek Reaction Viral | Sakshi
Sakshi News home page

IND vs PAK: ఫైనల్లో వైభవ్‌ విఫలం.. అభిషేక్‌ రియాక్షన్‌ వైరల్‌

Oct 3 2026 11:00 AM | Updated on Oct 3 2026 11:13 AM

IND vs PAK Final: Vaibhav Fails back to back Sixers, Abhishek Reaction Viral

PC: Sonysports X

ఆసియా క్రీడలు- 2026 పురుషుల టీ20 క్రికెట్‌ టోర్నమెంట్‌ ఫైనల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. పసిడి పతక పోరులోనూ ఓపెనర్లుగా అభిషేక్‌ శర్మ- వైభవ్‌ సూర్యవంశీ జోడీని యాజమాన్యం కొనసాగించింది.

తొలి ఓవర్‌లో కష్టంగా
కాగా జపాన్‌లోని నిశిన్‌ పిచ్‌పై స్పిన్‌ తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ సయీబ్‌ ఆయుబ్‌తో పాక్‌ తమ బౌలింగ్‌ ఎటాక్‌ ఆరంభించింది. ఈ క్రమంలో తొలి ఓవర్లో వైభవ్‌ రెండు సింగిల్స్‌ తీయగా.. అభిషేక్‌ ఒక్క పరుగు మాత్రమే రాబట్టాడు. వైడ్‌ రూపంలో ఒక పరుగు వచ్చింది.

వరుసగా రెండు సిక్సర్లు
అయితే, రెండో ఓవర్లో వైభవ్‌ గేరు మార్చాడు. సాద్‌ మసూద్‌ బౌలింగ్‌లో రెండు, మూడు బంతుల్లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. ఇలా భారీ షాట్లతో అలరించిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ మూడో ఓవర్లో తొలి బంతికే సయీమ్‌ ఆయుబ్‌ బౌలింగ్‌లో.. వికెట్‌ కీపర్‌ ఉస్మాన్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు.

 ఏంటిది వైభవ్‌?
పాక్‌తో ఫైనల్లో మొత్తంగా 9 బంతులు ఎదుర్కొన్న వైభవ్‌ సూర్యవంశీ రెండు సిక్సర్ల సాయంతో 15 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. వైభవ్ అనవసరమైన రవర్స్‌ స్వీప్‌ షాట్‌ ఆడి‌ అవుటైన నేపథ్యంలో మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ‘ఏంటిది వైభవ్‌?’ అన్నట్లుగా అతడు ఇచ్చిన రియాక్షన్‌ వైరల్‌గా మారింది.

ఇక వైభవ్‌ స్థానంలో వన్‌డౌన్‌లో వచ్చిన సంజూ శాంసన్‌ (2) కూడా నిరాశపరచగా.. అభిషేక్‌ మాత్రం విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పాక్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇరవై బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించిన ఈ లెఫ్టాండర్‌.. మొత్తంగా 28 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 61 పరుగులు సాధించాడు. అరాఫత్‌ మిన్హాస్‌ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. 

చదవండి: IND vs WI: శ్రేయస్‌ అయ్యర్‌దే తుది నిర్ణయం కావాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement