ఆసియా క్రీడలు-2026 పురుషుల టీ20 టోర్నమెంట్ ఫైనల్లో టీమిండియా- పాకిస్తాన్ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. జపాన్‌లోని నిశిన్ వేదికగా టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
UPDATES:
ఐదు ఓవర్లలో భారత్ స్కోరు: 53-2
👉అభిషేక్ 40, అయ్యర్ 3 పరుగులతో ఉన్నారు.
👉4.1 ఓవర్: అరాఫత్ మిన్హాస్ బౌలింగ్‌లో డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా సిక్సర్ బాదిన అభిషేక్
నాలుగు ఓవర్లలో భారత్ స్కోరు: 52-2
👉అభిషేక్ 32, అయ్యర్ సున్నా పరుగులతో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన భారత్
👉3.5 ఓవర్: దనియాల్ బౌలింగ్‌లో అరాఫత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన సంజూ (2). శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు.
👉3.2 ఓవర్: అహ్మద్ దనియాల్ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా సిక్సర్ బాదిన అభిషేక్.. టీమిండియా హాఫ్ సెంచరీ
మూడు ఓవర్లలో భారత్ స్కోరు: 43-1
👉అభిషేక్ 9 బంతుల్లో 25 పరుగులతో, సంజూ ఒక పరుగుతో ఉన్నారు.
👉2.6 ఓవర్: లాంగాఫ్ మీదుగా ఫోర్ బాదిన అభిషేక్
👉2.5 ఓవర్: లాంగాన్ మీదుగా ఫోర్ బాదిన అభిషేక్
👉2.4 ఓవర్: సయీబ్ ఆయుబ్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాదిన అభిషేక్ శర్మ
వైభవ్ అవుట్
👉2.1 ఓవర్: సయీమ్ ఆయుబ్ బౌలింగ్‌లో వైభవ్ ఉస్మాన్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మొత్తంగా తొమ్మిది బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్ల సాయంతో 15 పరుగులు చేసి అవుటైన వైభవ్. సంజూ క్రీజులోకి వచ్చాడు.
రెండు ఓవర్లలో భారత్ స్కోరు: 28-0
👉అభిషేక్ 11, వైభవ్ 15 పరుగులతో ఉన్నారు.
👉ఆరో బంతి నోబాల్ కాగా.. ఫ్రీ హిట్‌ను ఫోర్‌గా మలిచిన అభిషేక్
అభిషేక్ భారీ సిక్సర్
👉ఐదో బంతికి సిక్సర్ బాదిన అభిషేక్

వైభవ్ వరుస సిక్సర్లు
👉రెండో ఓవర్ రెండో బంతికి సాద్ మసూద్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన వైభవ్
👉మూడో బంతిని కూడా సిక్సర్‌గా మలిచిన వైభవ్
తొలి ఓవర్లో భారత్ స్కోరు: 4-0
సయీబ్ ఆయుబ్ బౌలింగ్‌లో వైభవ్ రెండు సింగిల్స్, అభిషేక్ ఒక సింగిల్ తీశారు. వైడ్ రూపంలో ఒక పరుగు వచ్చింది.
నో షేక్‌హ్యాండ్
తొలి సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను పాకిస్తాన్.. రెండో సెమీస్ మ్యాచ్‌లో శ్రీలంకను టీమిండియా ఓడించి పసిడి పతక పోరుకు అర్హత సాధించాయి. ఇక టాస్ సందర్భంగా ఆసియా కప్-2025, టీ20 ప్రపంచకప్-2026 నాటి ఘటనే పునరావృతమైంది. టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పాక్ సారథి సాహిబ్‌జాదా ఫర్హాన్‌తో కరచాలనం చేయలేదు.
ఇదిలా ఉంటే.. శ్రీలంకతో సెమీ ఫైనల్లో ఆడిన తుదిజట్టులో మార్పులు లేకుండా భారత్ బరిలోకి దిగింది. ఫలితంగా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ ఎలెవన్‌లో మరోసారి చోటు దక్కింది.
కఠినమైన పిచ్
నిశిన్ పిచ్‌పై స్పిన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. బ్యాటింగ్ అంత తేలిక కాదని గత మ్యాచ్‌ల ద్వారా ఇప్పటికే నిరూపితమైంది. అయితే, సెమీస్‌లో భారత పేసర్ బుమ్రా కూడా ఇక్కడ రాణించడం సానుకూల అంశం. ఇక తుదిజట్టులోస్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, స్పెషలిస్టు రవి బిష్ణోయితో పాటు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వంటి పార్ట్‌టైమ్ స్పిన్నర్లు కూడా ఉన్నారు.

తుదిజట్లు
భారత్
వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయి, జస్‌ప్రీత్ బుమ్రా.

పాకిస్తాన్
సాహిబ్‌జాదా ఫర్హాన్ (కెప్టెన్), మాజ్ సదాకత్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), సయీమ్ ఆయుబ్, హసన్ నవాజ్, అబ్దుల్ సమద్, అరాఫత్ మిన్హాస్, అహ్మద్ దనియాల్, సాద్ మసూద్, అబ్రార్ అహ్మద్, సూఫియాన్ మొకీమ్.


