భారత క్రికెట్‌లో ఇవాళ (అక్టోబర్ 3) అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకోబోతుంది. 28 ఏళ్ల తర్వాత రెండు వేర్వేరు సీనియర్ పురుషుల క్రికెట్ జట్లు ఒకే రోజు బరిలోకి దిగబోతున్నాయి. ఇలాంటి ఘటన తొలిసారి 1998లో జరిగింది. నాడు కామన్వెల్త్ గేమ్స్, సహారా కప్ టోర్నీల్లో రెండు వేర్వేరు భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్లు ఒకే రోజు బరిలోకి దిగాయి.
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత జట్టు అజయ్ జడేజా నేతృత్వంలో.. సహారా కప్‌లో భారత జట్టు మొహమ్మద్ అజహరుద్దీన్ కెప్టెన్సీలో బరిలోకి దిగాయి. 28 ఏళ్ల తర్వాత మళ్లీ రెండు వేర్వేరు భారత జట్లు ఒకే రోజు రెండు టోర్నీల్లో పాల్గొంటున్నాయి. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు ఏషియన్ గేమ్స్ ఫైనల్లో పాకిస్తాన్‌తో తలపడుతుండగా.. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని టీమిండియా ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా విండీస్‌తో తలపడనుంది.
జపాన్‌లోని నిస్సిన్ నగరంలో ఏషియన్ గేమ్స్ ఫైనల్ జరుగనుండగా.. భారత్‌లోని న్యూ ఛండీఘడ్‌లో విండీస్ మ్యాచ్ జరుగనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో భారత్ తమ అత్యుత్తమ జట్లనే బరిలోకి దించింది. టీ20 ఫార్మాట్‌లోని టాప్ జట్టు ఆసియా క్రీడల్లో, వన్డే ఫార్మాట్లోని అత్యుత్తమ జట్టు విండీస్‌తో వన్డేలో తలపడనుంది.
పాక్‌తో ఏషియన్ గేమ్స్ ఫైనల్ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుండగా.. విండీస్‌తో వన్డే మధ్యాహ్నం రెండు గంటలకు మొదలవుతుంది.
ఇదీ చదవండి: Asian Games Men's Cricket: శ్రీలంక జట్టుకు కాంస్యం


