విండీస్‌తో మూడో వన్డే.. భారీ రికార్డులపై కన్నేసిన గిల్‌ | Records That Shubman Gill Can Achieve in India vs West Indies 3rd ODI | Sakshi
Sakshi News home page

విండీస్‌తో మూడో వన్డే.. భారీ రికార్డులపై కన్నేసిన గిల్‌

Oct 3 2026 7:21 AM | Updated on Oct 3 2026 7:21 AM

Records That Shubman Gill Can Achieve in India vs West Indies 3rd ODI

source: BCCI X

వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికే ఓ సెంచరీ, డబుల్‌ సెంచరీ చేసిన అతడు.. మూడో వన్డేలోనూ మూడంకెల మార్కును అందుకోవాలని పట్టుదలగా ఉన్నాడు.

ఈ నేపథ్యంలో ఇవాళ జరుగబోయే మూడో మ్యాచ్‌నూ సెంచరీ చేస్తే గిల్‌ ఓ అరుదైన రికార్డును సాధిస్తాడు. మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌లో మూడు సెంచరీలు చేసిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్‌గా నిలుస్తాడు. గతంలో బాబర్‌ ఆజం (2016లో వెస్టిండీస్‌పై), క్వింటన్‌ డికాక్‌ (2013లో భారత్‌పై) మాత్రమే ఈ అరుదైన ఫీట్‌ సాధించారు.

గిల్‌ మూడో వన్డేలో సెంచరీ చేస్తే మరో రికార్డు కూడా సమం చేస్తాడు. విండీస్‌పై అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన భారత బ్యాటర్ల జాబితాలో విరాట్‌ తర్వాతి స్థానంలో సచిన్‌ టెండూల్కర్‌తో సమంగా నిలుస్తాడు. విరాట్‌ విండీస్‌పై అత్యధికంగా 9 వన్డే సెంచరీలు చేయగా.. సచిన్‌ 4, గిల్‌ 3 సెంచరీలు చేశారు.

ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లో కలిపి 333 పరుగులు చేసిన గిల్‌.. నేటి మ్యాచ్‌లో మరో 28 పరుగులు చేసినా, మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా తన రికార్డును తానే మెరుగుపర్చుకుంటాడు. ప్రస్తుతం ఈ రికార్డును గిల్‌.. బాబర్‌ ఆజంతో కలిసి షేర్‌ చేసుకుంటున్నాడు. గతంలో ఇద్దరూ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 360 పరుగులు సాధించారు.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. న్యూ ఛండీఘడ్‌ వేదికగా ఇవాళ మూడో వన్డే జరుగనుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్‌ ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది. నామమాత్రపు ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. నేటి మ్యాచ్‌లో అందరి కళ్లు గిల్‌ ప్రదర్శనపైనే ఉన్నాయి. 

ఇదీ చదవండి: Asian Games: అచ్చొచ్చిన శుక్రవారం.. ఒకేరోజు ఆరు స్వర్ణాలు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement