విండీస్‌తో మూడో వ‌న్డే.. టార్గెట్ 'క్లీన్‌స్వీప్‌'! | Team India-Target Clean Sweep-One-Change-Playing XI-Vs WI 3rd ODI | Sakshi
Sakshi News home page

IND Vs WI: విండీస్‌తో మూడో వ‌న్డే.. టార్గెట్ 'క్లీన్‌స్వీప్‌'!

Oct 2 2026 8:19 PM | Updated on Oct 2 2026 8:22 PM

Team India-Target Clean Sweep-One-Change-Playing XI-Vs WI 3rd ODI

Photo Credit: BCCI Twitter

భార‌త్‌, వెస్టిండీస్ మ‌ధ్య జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారుతోంది. తొలి వ‌న్డేలో ఇరుజ‌ట్లు క‌లిపి 500కు పైగా ప‌రుగులు చేస్తే, రెండో వ‌న్డేలో ఏకంగా 800కు పైగా ప‌రుగులు సాధించాయి. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న ప్లాట్‌పిచ్‌ల‌పై ఇరుజ‌ట్ల బ్యాట‌ర్లు చెల‌రేగారు. ఇప్ప‌టికే సిరీస్‌లో ఏడు శ‌త‌కాలు న‌మోద‌య్యాయి. 

నిర్జీవం లేని పిచ్‌ల‌పై మ్యాచ్‌లు ఆడ‌డంపై కొంద‌రు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. బ్యాట్‌, బాల్ మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేద‌ని స్వ‌యంగా భార‌త హెడ్‌కోచ్ గౌత‌మ్ గంభీర్ బ‌హిరంగంగానే అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం, ఈ నేప‌థ్యంలో శ‌నివారం జ‌ర‌గ‌నున్న మూడో వ‌న్డేకు బ్యాట్‌కు, బంతికి స‌మ‌న్వ‌యం కుదిరేలా పిచ్‌ను రూపొందించిన‌ట్లు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా టార్గెట్ క్లీన్‌స్వీప్ దిశ‌గా అడుగులు వేస్తుంది. ఇప్ప‌టికే సిరీస్ సొంతం కావ‌డంతో మొద‌ట జ‌ట్టులో మార్పులు చేయాల‌ని భావించింది. కానీ చివ‌రి నిమిషంలో టీమిండియా మేనేజ్‌మెంట్ దానిని ఉప‌సంహ‌రించుకున్న‌ట్లు తెలుస్తోంది. 

"టార్గెట్ క్వీన్‌స్వీప్‌" అని భావిస్తున్న టీమిండియా ఒకటి లేదా రెండు మార్పులు మాత్ర‌మే చేసే అవ‌కాశ‌మున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌సిధ్ క్రిష్ణ స్థానంలో సిరాజ్ ఆడే అవ‌కాశ‌ముండ‌గా, నితీశ్‌కుమార్ రెడ్డి కూడా జ‌ట్టులోకి వ‌చ్చే చాన్స్ లేక‌పోలేదు. ఇది మిన‌హా తొలి రెండు వ‌న్డేల‌కు ఆడిన జ‌ట్టునే దాదాపు ఆడించాల‌ని చూస్తోంది.

భారత జట్టుకు ప్రధాన సమస్యగా మారిన అంశం బౌలింగ్ విభాగమే. మధ్య ఓవర్లలో వికెట్లు తీయడంలో బౌలర్లు ఇబ్బంది పడుతున్నారు. కుల్దీప్ యాదవ్‌కు సహకారం లభించడం లేదు. రవీంద్ర జడేజా కూడా గత ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం మూడు వికెట్లే తీయడంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

మరోవైపు.. సిరీస్ కోల్పోయినప్పటికీ వెస్టిండీస్ బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. గువాహటి మ్యాచ్లో విండీస్ 405 పరుగులు చేసి గట్టి పోటీనిచ్చింది. జాన్ క్యాంప్బెల్, హోప్, అమీర్ జాంగూ శతకాలతో రాణించారు. ముల్లంపూర్లో తొలిసారిగా పురుషుల వన్డే మ్యాచ్ జరుగుతుండటంతో, ఇక్కడి పిచ్ బౌలర్లకు కొంతైనా సహకరిస్తుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన వెస్టిండీస్ జట్టు, ఈ ఆఖరి మ్యాచ్లోనైనా విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది.

భార‌త జ‌ట్టు అంచ‌నా:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, కెఎల్ రాహుల్ (వికెట్‌కీప‌ర్‌), నమన్ ధీర్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, గుర్నూర్‌ బ్రార్.

ఇదీ చదవండి: ఎస్ఆర్‌హెచ్‌ను వీడనున్న అభిషేక్‌ శర్మ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement