‘గోల్డ్‌ గెలిచినా పట్టించుకోలేదు.. రెండ్రోజుల తర్వాత సీఎం ఫోన్‌’ | MR Poovamma Says KA CM Congratulated Her 2 Days After Gold Asian Games | Sakshi
Sakshi News home page

‘గోల్డ్‌ గెలిచినా పట్టించుకోలేదు.. రెండ్రోజుల తర్వాత సీఎం ఫోన్‌’

Oct 2 2026 5:25 PM | Updated on Oct 2 2026 5:56 PM

MR Poovamma Says KA CM Congratulated Her 2 Days After Gold Asian Games

PC: Instagram

ఆసియా క్రీడలు-2026 టోర్నీలో అథ్లెటిక్స్‌లో భారత్‌కు మంగళవారం స్వర్ణం అందించింది మహిళల రిలే జట్టు. కిరణ్‌ మహల్‌, ఎంఆర్‌ పూవమ్మ, ప్రాచీ ఛౌదరి, విత్య రామ్‌రాజ్‌ 4*400 మీటర్ల రిలే పరుగును 3 నిమిషాల 29.9 సెకన్లలో పూర్తి చేసి.. పసిడి పతకాన్ని ముద్దాడారు.

మూడో లెగ్‌ ముగిసే సమయానికి భారత్‌ మూడో స్థానంలోనే ఉన్నా.. ఆఖరి లెగ్‌లో అద్భుతంగా పరిగెత్తి విత్య జట్టును అగ్రస్థానంలో నిలిపింది. ఏషియాడ్‌ అథ్లెటిక్స్‌ చరిత్రలో మహిళల 4*400 మీటర్ల రిలే పరుగులో భారత్‌కు ఇది ఏడో పసిడి పతకం.

గోల్డ్‌ గెలిచినా పట్టించుకోలేదు.. 
ఈ నేపథ్యంలో కిరణ్‌, పూవమ్మ, ప్రాచీ, విత్యలపై ప్రశంసల వర్షం కురిసింది. అయితే, వీరిలో 36 ఏళ్ల పూవమ్మకు గోల్డ్‌ గెలిచినా సొంత రాష్ట్రం నుంచి కనీసం అభినందించే వారు లేక చేదు అనుభవం చవిచూడాల్సి వచ్చింది. సీఎన్‌ఎన్‌-న్యూస్‌18తో మాట్లాడుతూ.. పూవమ్మ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది.

రెండ్రోజుల తర్వాత సీఎం ఫోన్‌
‘‘బంగారు పతకం గెలిచిన రెండు రోజుల తర్వాత మా ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వర నాకు కాల్‌ చేసి.. మెడల్‌ సాధించినందుకు అభినందించారు. నన్ను ఎవరూ పట్టించుకోలేదని మీడియాలో వార్తలు వచ్చిన తర్వాతే వాళ్లు నాకు ఫోన్‌ చేశారు.

అయితే, పతకాలు గెలిచిన అథ్లెట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీని త్వరలోనే పెంచుతామని సీఎం నాతో చెప్పారు. నన్ను సత్కరిస్తామని కూడా అన్నారు’’ అని కర్ణాటకలోని దక్షిణ కన్నడ ప్రాంతానికి చెందిన పూవమ్మ తెలిపింది.

చదవండి: త్వరలోనే టీమిండియా టీ20 వైస్‌ కెప్టెన్‌గా అతడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement