Photo Credit: Twitter
రెజ్లింగ్‌లోనూ భారత్‌కు స్వర్ణ పతకం దక్కింది. భారత రెజ్లర్ 23 ఏళ్ల సుజీత్ కల్కల్ తన ఉడుం పట్టుతో పసిడి దక్కించుకున్నాడు. పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ విభాగం ఫైనల్లో సుజీత్ 10-9తో తజకిస్తాన్‌కు చెందిన అబ్దుల్‌మహ్‌జిద్ కుదీవ్‌ను మట్టికరిపించాడు. కాగా ఈసారి ఆసియా గేమ్స్‌లో రెజ్లింగ్‌లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం.
ఓవరాల్‌గా ఆసియా గేమ్స్‌లో గతంలో స్వర్ణాలు సాధించిన రెజ్లర్లు యోగేశ్వర్ దత్, భజరంగ్ పూనియా సరసన సుజీత్ కల్కల్ చేరాడు. ఈ ఆసియా గేమ్స్‌లో ఇప్పటివరకు భారత్ 75 పతకాలు గెలుచుకోగా.. ఇందులో 15 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్య పతకాలు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ పతకాల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది.
Sujeet Kalkal Wins Gold medal for India🔥🔥🔥
He defeats Tajikistan wrestler in a close bout 10-9 🔥🔥🔥 in his 65 kg category wrestling Final bout
Sujeet loses 9 points early on and then climbs back up to win 10-9
Also Ankush wins gold in his bout against Korean in 80 kg… pic.twitter.com/n9Rl8VZlzn— XUnfiltered (@XUnfiltere69061) October 2, 2026
ఇదీ చదవండి: బాక్సర్ల పసిడి పంచ్.. భారత్ ఖాతాలో 75వ పతకం


